AP EAMCET 2025 లో కేవలం 40 మార్కులు వచ్చిన వారికి పెద్ద శుభవార్త : రెండు విధాలుగా మీకు మార్కులు కలుస్తాయి – వెంటనే ఇలా చేయండి

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలో రాసిన విద్యార్థుల యొక్క ఆన్సర్ కి, రెస్పాన్స్ షీట్స్ ని ఉన్నత విద్యాశాఖ మండల విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్న విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు చూసి చాలా కంగారు పడుతున్నారు. చాలామందికి 40 కంటే తక్కువ మార్కులు లేదా 40 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఉండటం వల్ల వారికి అసలు ఎటువంటి ర్యాంకు, రాదేమో వారు డిస్క్వాలిఫై అవుతారేమో, ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాదేమో అని చాలా బాధపడుతున్నారు. అయితే అలాంటి విద్యార్థులు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు రెండు విధాలుగా మీకు మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఆర్టికల్ చదివి ఇందులో చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి. మార్కులు పెరిగితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ర్యాంకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మీరు రెండు విధాలుగా ఏ విధంగా మీరు మార్కులను పెంచుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.

1. నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల మార్కులు కలిసే అవకాశం ఉంది :

ఎంసెట్ పరీక్షల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ షిఫ్ట్ లు రాత పరీక్షలు నిర్వహిస్తే, శుక్రవారం గా వచ్చిన పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ని ఆధారంగా చేసుకుని అందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా నార్మలైజేషన్ విధానం ద్వారా అన్ని సూక్తుల విద్యార్థులకు సమానమైన మార్కులు ఇవ్వబడతాయి.

Join Whats App Group

ఈ విధానం వల్ల:

  • మీ షిఫ్ట్ లో పేపర్ కష్టంగా ఉన్నా కూడా
  • ఇతర శుక్ల వారితో పోలిస్తే మీకు మార్కులు పెరగవచ్చు
  • మీ ఎంసెట్ స్కోర్ అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది

2. అబ్జెక్షన్స్ పెట్టుకోవడం వల్ల మార్కులు పెరుగుతాయి :

ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కి విడుదలైనందున ప్రాథమిక ఆన్సర్ కీ లో ఏమైనా తప్పులు గమనించినట్లయితే, ఆ తప్పులు ఉన్న ప్రశ్నలకు మీరు అబ్జెక్షన్స్ పెట్టినట్లయితే మీకు మార్కులు ఖచ్చితంగా కలుస్తాయి.

AP EAMCET 2025 Marks Vs Rank

మీరు పెట్టుకున్న అబ్జెక్షన్ వ్యాలీడ్ అయితే:

  • ఆ ప్రశ్నను డిలీట్ చేయవచ్చు లేదా
  • మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ రైట్ ఆన్సర్ గా మారుతుంది.
  • ఇలా మళ్లీ మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంది.

ఒక ఉదాహరణ చూద్దాం:

ఒక విద్యార్థికి స్టాండర్డ్ కి ప్రకారం 43 మార్కులు వచ్చాయి అనుకుందాం. అయితే

  • నార్మలైజేషన్ విధానం తర్వాత ఆ మార్కులు 47 నుండి 49 వరకు పెరిగే అవకాశం ఉంది
  • ఒకటి లేదా రెండు అబ్జెక్షన్ వ్యాలీడ్ అయితే అదనంగా రెండు నుంచి నాలుగు మార్కులు రావచ్చు.
  • మొత్తానికి మార్కులు 50+ దాకా పెరిగే అవకాశం ఉంది.

కావున ఇప్పుడు ఏమి చేయాలంటే:

మీకు మార్కులు పెరగడం కోసం ఈ క్రింది పనులు చేయండి.

AP EAMCET 2025 Answer Key

  1. మొదట ప్రాథమిక ఆన్సర్ కి బాగా చెక్ చేయండి
  2. తప్పులు గమనించినట్లయితే అబ్జెక్షన్ పెట్టుకోండి
  3. ఫైనల్ కి వచ్చేదాకా వెయిట్ చేయండి
  4. నార్మలైజేషన్ తర్వాత ఫైనల్ స్కోర్ ఖరారు అవుతుంది.

కాబట్టి 40 మార్కులు వచ్చిన వారు కంగారు పడొద్దు.పైన చెప్పిన రెండు విధాల ద్వారా మీకు మార్పులు కలుస్తాయి దాని ద్వారా మీ ర్యాంకు కూడా మెరుగవుతుంది. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకు షేర్ చేయండి.