తల్లికి వందనం పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: ప్రతి బిడ్డకు ₹15000/- తల్లి అకౌంట్లో వేస్తారు- కావలసిన అర్హతలు మరియు సర్టిఫికెట్స్

AP Thalliki Vandhanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్లేటువంటి పిల్లల తల్లులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీ నాడు అంటే పాఠశాలల రీఓపెనింగ్ రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే అంతమంది ఎకౌంట్లోను ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పథకం పొందాలి అంటే తల్లులకు ఉండవలసిన అర్హతలు, అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన సర్టిఫికెట్లకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా తల్లుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, విద్యార్థులు చదువు వైపు మళ్ళీ స్కూల్ కి వచ్చి మంచిగా చదువుకోవడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

తల్లికి వందనం పథకం యొక్క ముఖ్యమైన అంశాలు:

Join Whats App Group

అంశము వివరాలు
పథకం పేరుతల్లికి వందనం(Thalliki Vandanam Scheme)
ప్రారంభ తేదీజూన్ 12, 2025 (స్కూల్స్ రీఓపెన్ చేసే రోజున)
లబ్ధిదారులు ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు
ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ₹15000/-
కలిగే ప్రయోజనం తల్లులకి ఆర్థిక సాయం మరియుపిల్లలకు స్థిర విద్య కొనసాగింపు.

ఈ పథకానికి కావాల్సిన అర్హతలు:

AP స్కూల్స్ అకడమీక్ క్యాలెండర్ 2025-26 విడుదల చేశారు

  1. నివాసం: ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి
  2. ఉండవలసిన విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలి. ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నవారు అర్హులు. కనీసం 75% హాజరు కలిగి ఉండాలి
  3. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
  4. తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.

ఉండవలసిన సర్టిఫికెట్స్ :

  • విద్యార్థి స్టడీ సర్టిఫికెట్స్
  • తల్లి ఆధార్ కార్డ్
  • తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు
  • నివాస పత్రము లేదా రేషన్ కార్డ్
  • కుల దృవీకరణ పత్రం ఒకవేళ అవసరమైతేనే
  • ఆదాయ సర్టిఫికెట్
  • పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్

అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి?:

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://gsws.ap.gov.in ఓపెన్ చేయండి
  2. ” తల్లికి వందనం” పథకం అనే ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. ఆధార్ వివరాల ఆధారంగా లాగిన్ అవ్వండి
  4. అన్ని ఖాళీలను పూర్తి చేయండి
  5. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయండి

ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాని విడుదల చేసి, తల్లు యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.