TGDEECET 2025 Results:
తెలంగాణ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను నిన్న అనగా ఆదివారం నిర్వహించారు. మొత్తం 43 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 33,821 మంది పరీక్షకు హాజరయ్యారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే ఎక్కువమంది రాత పరీక్షకు హాజరు కావడం జరిగిందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అయితే ఈ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను జూన్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ DEECET 2025 రిజల్ట్స్ డేట్:
తెలంగాణ DEECET 2025 ఫలితాలను జూన్ 5వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. ఆదివారం రోజున ఎంట్రన్స్ రాత్రి పరీక్షను ప్రశాంతంగా ముగించిన విద్యాశాఖ అధికారులు. ఫలితాలు విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి ఫలితాలని చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
తెలంగాణ డిఈఈసెట్ ఎంట్రన్స్ రాత పరీక్ష రాసిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
- ముందుగా తెలంగాణ డిఈఈసెట్ వెబ్సైట్ (TGDEECET Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో తెలంగాణ డిఈ ఈసెట్ 2025 రిజల్ట్స్ అనే ఆప్షన్ పే క్లిక్ చేయండి.
- పరీక్ష రాసిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీకు రిజల్ట్స్ చూపిస్తాయి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంతో నోట్ చేసుకోండి
- ఫలితాల్ని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.
TGDEECET 2025: Results Website
FAQ’s:
1. తెలంగాణ డిఈఈసెట్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
జూన్ 5వ తేదీ ఉదయం ఫలితాలు విడుదల చేయనున్నారు
2. తెలంగాణ డిఈఈసెట్ 2025 పరీక్ష ఎంత మంది రాశారు?
33వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాయడం జరిగింది.
