TS 10th supplementary exams 2025:
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలు జూన్ మూడవ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించారు.రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇంకా విడుదల చేయలేదు. మరో రెండు, మూడు రోజుల్లో హాల్ టికెట్స్ విడుదల చేయడం జరుగుతుంది. పరీక్షలు రాబోయే విద్యార్థులు మీ యొక్క మొబైల్ ఫోన్ నుండే హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్కూల్ కి వెళ్లి హాల్టికెట్స్ హెడ్మాస్టర్ నుంచి డౌన్లోడ్ చేయించుకోండి.
హాల్ టికెట్స్ విడుదల తేదీ:
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేయాలన్నారు. జూన్ మూడో తేదీ నుండి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పూర్తయిన వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- tgbie.cgg.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana 10th supplementary hall tickets” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి
- వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి
FAQ’s:
1. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు?
జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
2. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేయాలి?
మరో రెండు మూడు రోజుల్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
