TS POLYCET 2025 Results:
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో కోర్సులో ప్రవేశాలకు నిర్వహించినటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష అక్క ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. దాదాపుగా 98,000 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మే 13వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పాలీసెట్ పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి సర్టిఫికెట్స్ పరిశీలన చేసి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలను పూర్తి చేయడం జరుగుతుంది.
TS Polycet 2025 రిజల్ట్స్ విడుదల తేదీ మరియు సమయం:
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను మే 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు.పరీక్ష రాసిన అభ్యర్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లోనే అధికారిక వెబ్సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
TS పాలీసెట్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి:
పాలీసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ క్రింది విధంగా మీ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “TS POLYCET 2025 Results” ఆప్షన్పై క్లిక్ చేయండి
- అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి
TS Polycet 2025 Results : Official Website
FAQ’s:
1. తెలంగాణ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష మొత్తం ఎంతమంది రాశారు?
మొత్తం 98,858 మంది పరీక్ష రాశారు
2. తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
