AP EAMCET 2025: నాకు 100 మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? – Expected EAMCET Rank 2025

AP EAMCET 2025 exam:

ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నటువంటి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు ముగిసాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్ష రాసిన విద్యార్థులు వారికి వంద మార్కులు వస్తే 2025లో ఎంసెట్లో ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవాలని ఒక కుతూహలం వారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్ ద్వారా మీకు గనక ఎంసెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే ఎంత ర్యాంక్ వస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మేము మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ పూర్తిగా చూడగలరు.

ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోబోతున్న అంశాలు:

  • వంద మార్కులకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత?
  • గత సంవత్సరాలలో వచ్చిన మార్కులు vs ర్యాంక్ విశ్లేషణ
  • వెయిటేజ్ విధానం ( ఇంటర్ మార్క్స్ + EAPCET మార్క్స్ )
  • కౌన్సిలింగ్ కి సంబంధించిన సూచనలు

100 మార్కులు వస్తే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉంటుంది?:

ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మనం తెలుసుకోవాలి అంటే 2024 మరియు 2023 డేటా ఆధారంగా విశ్లేషణ చేయాలి. ఎంసెట్లో వంద మార్కులు వచ్చిన వారికి 18,000 నుండి 25,000 వరకు ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ లేదా ఫార్మసీ Stream తో లోకల్ vs నాన్ లోకల్, SC, ST, OBC,UR క్యాటగిరిలను బట్టి మారుతుంది.

Join Whats App Group

Expected Rank Range For 100 marks (Based On Trends):

MarksExpected Rank Range
10018,000-25,000
101-10515,000-18,000
95-9925,000-30,000

వెయిటేజ్ విధానం ఎలా ఉంటుంది

ఏపీ ఎంసెట్ పరీక్షలో ఫైనల్ ర్యాంక్ ప్రిపేర్ చేయడానికి 100% ఎంసెట్ మార్కులనే తీసుకుంటారు. 2022 సంవత్సరం నుండి ఇంటర్ వెయిటేజ్ మార్కులు కలపడం తీసేసారు. అంటే మీకు ఎంసెట్లో వచ్చిన మార్కులు ఆధారంగానే మీ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు.

ఎటువంటి ఫ్యాక్టర్స్ ర్యాంక్ రావడానికి ప్రభావం చూపిస్తాయి:

  1. Number of candidates appearing for the exam in your stream
  2. normalization process of EAMCET exam
  3. difficulty level of question paper
  4. reservation category
  5. Gender and local area reservation

కౌన్సిలింగ్లో ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది:

వంద మార్కులు ఎంసెట్లో వచ్చినటువంటి విద్యార్థులకు కొన్ని ప్రభుత్వ కళాశాలలో లేదా కొన్ని మిడ్ లెవెల్ ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా అన్ని బ్రాంచీలలో సీటు రాదు కొన్ని బ్రాంచ్ లోనే సీటు వస్తుంది. CSE, ECE బ్రాంచ్లో సీట్ రాదు.

Past year comparison:

2024లో వంద మార్కులు వచ్చిన విద్యార్థికి 22,800 ర్యాంకు వచ్చింది, అలాగే 2023లో వంద మార్కులు వచ్చిన విద్యార్థికి 19,500 ర్యాంకు వచ్చింది. కాబట్టి వంద మార్కులు వచ్చిన వారికి ఈ మధ్యలోనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి కూడా.

వంద మార్కులు వస్తే మీకు ఒక moderate ర్యాంకు వస్తుంది కానీ అది ఏ కాలేజీలో మీకు సీటు వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. మీరు ఎంచుకున్న బ్రాంచ్ కాలేజ్ సీట్ ని ఆధారంగా చేసుకుని మీకు బ్రాంచ్ అనేది ఇస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు:

1. నాకు ఎంసెట్లో వంద మార్కులు వచ్చాయి. అయితే మంచి కాలేజీలో సీటు వస్తుంది కదా?

మీరు ఎంచుకునే బ్రాంచ్ ఆధారంగా కొన్ని ప్రభుత్వా లేదా ప్రైవేట్ కళాశాలలో అవకాశముంటుంది

2. వంద మార్కులకు CSE బ్రాంచ్ వస్తుందా?

చాలా టాప్ కాలేజీల్లో సీట్ రావడం కష్టం. కానీ కొన్ని మిడ్ లెవెల్ కాలేజెస్ లో సీటు వచ్చే అవకాశం ఉంది