TSPSC Group 2 results released: how to check results @tspsc.gov.in/

TSPSC Group 2 Results:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా రాసినటువంటి ఈ పరీక్షకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మొత్తం 775 క్యాండిడేట్స్ యొక్క లిస్టు ని విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టులో ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయో వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావాలి. 2024 లో జరిగిన ఈ రాత పరీక్షకి సంబంధించి ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి 29th మే నుండి 10th జూన్ వరకు హాజరు కావాల్సిందిగా అధికారిక నోటీసులో తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీకి షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన కొరకు ఆ ప్రదేశానికి వెళ్లి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలెను. సబ్మిట్ చేయని అభ్యర్థులు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నోటీసులో తెలిపినటువంటి సర్టిఫికెట్లను ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కాగలరు.

తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :

తెలంగాణ గ్రూప్ 2 ఉద్యోగాల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

Join Whats App Group

  1. ముందుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ వెబ్సైట్ (TGPSC Website Link) ను ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో గ్రూప్ 2 ఫలితాలు యొక్క వెబ్ నోట్ తో పాటు, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల యొక్క పిడిఎఫ్ లింకు ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి
  3. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన పిడిఎఫ్ లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి
  4. హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకి షార్ట్ లిస్ట్ అయ్యారని అర్థం.
  5. షార్ట్లిస్ట్ అయినవారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:

  • అప్లికేషన్ ఫార్మ్ పిడిఎఫ్
  • హాల్ టికెట్
  • ఆధార్ కార్డ్
  • అర్హత సర్టిఫికెట్స్
  • టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్
  • ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
  • రెసిడెన్సి సర్టిఫికెట్
  • కుల దృవీకరణ పత్రాలు
  • వికలాంగుల సర్టిఫికెట్
  • నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
  • ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్
  • సర్వీసెస్ సర్టిఫికెట్
  • ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్
  • ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్
  • ఇతర ఏమైనా ముఖ్యమైన సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రారంభ తేదీ: 29th మే 2025
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఖరు తేదీ: 10th జూన్ 2025
  • TSPSC Website : Click Here

పైన తెలిపిన తేదీలలో షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీకి హాజరు కావలెను.