JEE Advanced 2025 Response Sheet:.
ఐఐటీల్లో మరియు ఎన్ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ రాతపరీక్ష యొక్క రెస్పాన్స్ షీట్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేయనున్నట్లు ఐఐటి కాన్పూర్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష రాశారు. ఈ పరీక్ష మే 18వ తేదీన జరిగింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈరోజు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి, మే 26వ తేదీన ఆన్సర్ కీ ని విడుదల చేయడం జరుగుతుంది. ఆన్సర్ కి విడుదల చేశాక అబ్జెక్షన్ పెట్టుకున్న అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2వ తేదీన ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. జూన్ 3 నుంచి ఐఐటి మరియు ఎన్ఐఐటి లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JOSAA) షెడ్యూల్ విడుదల చేస్తారు.
JEE Advanced 2025 Response Sheet:
జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష యొక్క రెస్పాన్స్ షీట్స్ ని ఈ క్రింది ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి (Website Link : https://jeeadv.ac.in/)
- వెబ్సైట్ హోం పేజ్ లో “Candidate Portal” పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ,పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- ” view response sheet ” ఆప్షన్ పే క్లిక్ చేసి షీట్ డౌన్లోడ్ చేసుకోండి.
JEE advanced Important Dates:
జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష ముఖ్యమైన తేదీలు
- రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ : మే 22
- ఆన్సర్ కి విడుదల తేదీ : మే 26
- ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ: జూన్ 2
- JOSAA షెడ్యూల్ ప్రారంభ తేదీ : జూన్ 3
విద్యార్థులకు సూచనలు:
- రెస్పాన్స్ షీట్స్ నిశితంగా పరిశీలించండి
- ప్రశ్నపత్రం యొక్క ఆన్సర్స్ లో ఏమైనా తప్పులు దొర్లినట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోండి.
- మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది కావున ఈ అవకాశం వదులుకోవద్దు
రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ పరీక్షలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
JEE Advanced Response Sheet: Website
FAQ’s:
1. జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష ఆన్సర్ కి విడుదల తేదీ?
మే 26వ తేదీన ఆన్సర్ కి విడుదల చేయనున్నారు.
