Telangana DEECET 2025:
తెలంగాణ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (Telangana DEECET 2025) పరీక్ష హాల్ టికెట్స్ మే 20వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు హాల్ టికెట్స్ వెబ్సైట్లో అధికారులు పొందుపరచకపోవడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే మే 21వ తేదీ సాయంత్రంలోగా హాల్ టికెట్స్ ని అందుబాటులో ఉంచడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎంట్రన్స్ పరీక్షకు 40,600 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2024 తో పోలిస్తే ఈసారి రెండు మూడు రెట్లు ఎక్కువగా అప్లికేషన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ తెలంగాణ DEECET 2025 రాత పరీక్షను మే 25వ తేదీన నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మే 28వ తేదీన సమయం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ని మార్చి 22వ తేదీన విడుదల చేశారు. తెలంగాణ DEECET 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ DEECET 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్:
తెలంగాణ DEECET 2025 రాతపరీక్షకు హాజరయ్య విద్యార్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని క్రింది విధంగా ఫాలో అవ్వండి.
- ముందుగా తెలంగాణ DEECET 2025 వెబ్సైట్ (TS DEECET 2025 Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana DEECET 2025 Hall Tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులకు రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ మీద హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. ప్రింట్ అవుట్ తీసుకోండి
TS DEECET 2025 షెడ్యూల్:
తెలంగాణ DEECET 2025 ఎంట్రన్స్ రాత పరీక్ష యొక్క పూర్తి షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది
- నోటిఫికేషన్ విడుదల తేదీ : మార్చి 22, 2025
- అప్లికేషన్ పెట్టుకునే ఆఖరి తేదీ : మే 15, 2025
- హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : మే 20, 2025
- రాత పరీక్ష నిర్వహించే తేదీ :మే 25, 2025
- అబ్జెక్షన్స్ పెట్టుకునే తేదీ : మే 28, 2025
FAQ’s:
1. తెలంగాణ DEECET 2025 హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ కాలేదు ఇప్పుడు ఏం చేయాలి?
కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మే 20వ తేదీన విడుదల చేయాల్సిన హాల్టికెట్స్ ని మే 21వ తేదీ సాయంత్రం లోగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
2. తెలంగాణ DEECET 2025 రాత పరీక్ష తేదీ ఎప్పుడు?
మే 25వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.
