AP EAMCET 2025 agriculture & pharmacy answer key postponed : ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ & ఫార్మసీ ఆన్సర్ కి ఆలస్యం: కీ విడుదల చేసే తేదీ ఇదే

AP EAMCET 2025 answer key :

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రెన్స్ రాత పరీక్షలో భాగంగా మే 19 మరియు 20 తేదీల్లో జరిగినటువంటి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల యొక్క ఆన్సర్ కి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. జేఎన్టీయూ అనంతపురం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ రాధ పరీక్ష యొక్క ఆన్సర్ కి (Answer Key Download) అని ఎంసెట్ ఉన్నత విద్యాశాఖ అధికారులు మే 27వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆన్సర్ కి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, లేదా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఆన్సర్ కి ఇచ్చేయోచయంలో ఉండడం వల్ల ఈరోజు విడుదల చేయాల్సిన ఆన్సర్ కి మే 27వ తేదీకి పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది.

ఆన్సర్ కి ఎప్పుడు విడుదల చేస్తారు?:

ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు యొక్క ఆన్సర్ కి మే 27వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత అన్ని పరీక్షలతో కలిపి ఈ ఆన్సర్ కి ని విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున విద్యార్థులు అధికారిక సమాచారం మరియు ఆన్సర్ కీ కోసం అధికారిక వెబ్సైట్ని ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ వివరాలు తెలుసుకోండి.

Join Whats App Group

How to download answer key:

ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయ్యే డౌన్లోడ్ చేసుకోండి

  • ఏపీ ఎంసెట్ 2025 ఆన్సర్ కి అఫీషియల్ వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోం పేజ్ లో ” AP EAMCET 2025 agricultural and pharmacy answer key download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే మీ యొక్క ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది.

అబ్జెక్షన్స్ ఎలా పెట్టుకోవాలి?:

అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు ఆన్సర్ కీ ని చూసుకున్న తర్వాత అందులో ఏమైనా తప్పులు గమనించినట్లయితే, ఆ తప్పులో ఉన్న ప్రశ్నలకు మీరు అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. అయితే అబ్జెక్షన్ పెట్టుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించవలెను.

AP EAMCET 2025 Answer Key Link

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు యొక్క ఆన్సర్ కి ఇంతవరకు ఎందుకు విడుదల కాలేదు?

అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష యొక్క ఆన్సర్ కి ఉన్నత విద్యా శాఖ పోస్ట్ పోన్ చేసింది. మే 27వ తేదీన ఆన్సర్ కి విడుదల చేస్తున్నారు.