Telangana Inter Online Admissions 2025 Started:
తెలంగాణలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే పొందేందుకు లింక్ ఆక్టివేట్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం DOST(degree online Services Telangana) లింకు ద్వారా ఆన్లైన్ అడ్మిషన్లు ఆహ్వానించబడుతున్నాయి. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించవచ్చు.
TS ఇంటర్ అడ్మిషన్స్ ముఖ్యమైన సమాచారం:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : మే 20, 2025
- వేదిక : ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కళాశాలలు
- అప్లికేషన్ పెట్టుకునే వెబ్సైట్: tsbie online admission portal (https://tgbie.cgg.gov.in/) లేదా DOST పోర్టల్ ద్వారా
- అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అభ్యర్థులు: పదో తరగతి పాస్ అయినవారు
- కావలసిన వివరాలు: టెన్త్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ , అడ్రస్ మరియు మెయిల్ ఐడి ఇతర వివరాలు కావలెను
అప్లికేషన్ చేసే విధానం:
- విద్యార్థుల ముందుగా అధికారిక వెబ్సైట్ (https://tgbie.cgg.gov.in/) సందర్శించండి
- అందులో ” online admissions 2025” ఆప్షన్ పై క్లిప్ చేయండి.
- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తదుపరి వివరాలు నమోదు చేయాలి
- కాలేజీ మరియు కోర్సు వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి
- అభ్యర్థి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సీట్ అల్లౌట్మెంట్ జరుగుతుంది.
ముఖ్యమైన సూచనలు:
- విద్యార్థులు జిల్లాల వారీగా మరియు మండలాల వారీగా ఉన్న ప్రభుత్వం జూనియర్ కళాశాల వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు.
- ఎంపిక చేసిన జూనియర్ కళాశాలలో సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది.
- మొదటి రెండు పూర్తి అయిన తర్వాత రెండో రౌండ్ మరియు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి.
TS Inter Online Admissions : Website Link
పైన తెలిపిన విధంగా అప్లికేషన్ ఫారం పూర్తి చేసి,అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకొని మీరు అప్లై చేసిన కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్ కి అది సబ్మిట్ చేయాలి. అప్పుడు ప్రిన్సిపల్ దానిని ధ్రువీకరించి మీకు కళాశాలలో సీటు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఎటువంటి తప్పులు లేకుండా ఆన్లైన్లోనే ఇంటర్ అడ్మిషన్స్ మీరు పొందవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
