AP polycet 2025 counselling registration:
ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఎంట్రన్స్ రాత పరీక్ష యొక్క ఫైనల్ ఫలితాలను మే 14వ తేదీన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలు పెడతారు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సీట్ అల్లౌట్మెంట్ ఎప్పుడు చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనేటువంటి వాటిపై చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అయితే మంచి ర్యాంకు వచ్చినటువంటి వారు గానీ లేదా తక్కువ ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థులకి కౌన్సిలింగ్ ఎప్పటినుండి ప్రారంభమవుతుందని పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో చూద్దాము. మీరు ఏపీ పాలీసెట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులైతే కచ్చితంగా ఈ ఆర్టికల్ మొత్తం చూడండి.
AP polycet 2025 counselling schedule:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి సమాచారం ఈ క్రింది వివరాల ద్వారా తెలుసుకోండి.
- ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన తేదీ: 14th మే, 2025
- కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ : మే, 2025
- ఫీజు ఎప్పుడు చెల్లించాలి: మే 2025
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ : మే 2025
- ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు : జూన్ 2025
- ఆప్షన్స్ చేంజ్ చేసుకునేది: జూన్ 2025
- ఏపీ పాలిసెట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసేది : జూన్ 2025
- సెల్ఫ్ రిపోర్టింగ్ లేదా రిపోర్టింగ్ కాలేజ్ : జూన్ 2025
అధికారికంగా ఏపీ పాలీసెట్ 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర ముఖ్యమైన తేదీల యొక్క షెడ్యూల్ రాలేదు కానీ పైన తెలిపినటువంటి తేదీలలోనే లేదా నెలలోనే పాలీసెట్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది.
AP polycet 2025 Rank vs College vs Seat
కౌన్సిలింగ్ కి కావలసిన ముఖ్యమైన సర్టిఫికెట్స్ :
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఈ క్రింది సర్టిఫికెట్స్ కచ్చితంగా అభ్యర్థులు కలిగి ఉండాలి.
- ఏపీ పాలీసెట్ 2025 ర్యాంక్ కార్డ్
- ఏపీ పాలీసెట్ 2025 హాల్ టికెట్
- టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో
- క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికేట్
- బోనాఫిడే సర్టిఫికెట్
- రెసిడెన్సి సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడెంటి ప్రూఫ్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్
పైన తెలిపిన సర్టిఫికెట్స్ మీ దగ్గర లేకపోతే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే తేదీ నాటికి వెంటనే వాటిని రెడీ చేసుకోండి.
AP polycet 2025 tuition fee structure:
ఏపీ పాలీసెట్ 2025 లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో జాయిన్ అవ్వడానికి ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
- గవర్నమెంట్ లేదా ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలకు : ₹4,700/- ఫీజు
- ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు : ₹25,000/- ఫీజు చెల్లించాలి.
AP polycet counselling registration official website
FAQ’s:
1. ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
మే నెల 24 నుంచి 26వ తేదీ మధ్యన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది
2. ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు?
జూన్ 2025 లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది.
