AP EAMCET 2025 Exam:
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎంసెట్ 2025 పరీక్షను ఈరోజు నుంచి మే 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 3,61,000+ విద్యార్థులు ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫార్మసీ అగ్రికల్చర్ విభాగంలో 85 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా మే 19, 20 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు రోజుకి రెండు షిఫ్టులవారీగా పరీక్షలు జరుగుతాయి.తర్వాత ఇంజనీరింగ్ పరీక్షలు మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం షిఫ్టులో 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ లో మూడు గంటల నుండి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరీక్ష సెంటర్ కు హాజరు కావాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించమని అధికారులు తెలిపారు. కావున విద్యార్థులు త్వరగా పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.
అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్ అనాలసిస్:
ఈరోజు జరిగిన ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల యొక్క మొదటి మరియు రెండవ shifts లో అడిగిన ప్రశ్నలు పేపర్ యొక్క ఎనాలసిస్ ఇక్కడ తెలుసుకోవచ్చు.
ప్రాత పరీక్ష రాసిన విద్యార్థులను ప్రశ్నపత్రం ఎలా వచ్చింది అనేదానికి సంబంధించి వివరాలు తెలుసుకున్న తర్వాత అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల ప్రశ్నల కట్టినత్వం, పేపర్ ఎనాలసిస్ కి సంబంధించిన సమాచారం ఇక్కడే అప్డేట్ చేయడం జరుగుతుంది. కావున అభ్యర్థులు మా వెబ్సైట్ ని తరచుగా విజిట్ చేయండి.
Paper Analysis Update Soon……
ఏపీ ఎంసెట్ 2025 పరీక్షల షెడ్యూల్:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల పూర్తి షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉంది.
ఏపీ ఎంసెట్ పరీక్షకు ఈ టాపిక్ చదువుకుని వెళ్ళండి : 160 కి 125+ మార్క్స్ వస్తాయి
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల తేదీ : మే 19 నుండి 20 వరకు
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల ఆన్సర్ కి విడుదల తేదీ : మే 21, 2025
- ఇంజనీరింగ్ పరీక్షల తేదీ : మే 21 నుండి 27 వరకు
- ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ విడుదల తేదీ : మే 28,2025
ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేయాలి?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఆన్సర్ కి క్రింది స్టెప్ డే ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ను (Official Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు యొక్క ప్రాథమిక కి డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీరు రాసిన పరీక్ష యొక్క ప్రాథమిక కీ డౌన్లోడ్ అవుతుంది
- ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయండి మార్కులు కలుస్తాయి.
ఈరోజు నుండి పరీక్ష రాబోయే విద్యార్థులు ఇటువంటి అధైర్య పడకుండా టెన్షన్ పడకుండా మీరు చదివినటువంటి అంశాల్ని మననం చేసుకుంటూ పరీక్ష రాయండి విజయం మీదే.
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల ఆన్సర్ కి విడుదల ఎప్పుడు?
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు ఆన్సర్ కి మే 21వ తేదీన విడుదల చేయనున్నారు.
2. ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?
మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
