టెన్త్ పాస్ అయిన ఏపీ తెలంగాణ విద్యార్థులకు ₹10వేల నుండి ₹75వేల వరకు విద్యాదాన్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు : వెంటనే అప్లై చేయండి

Vidyadhan Scholarships 2025:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల రూపాయల నుండి 75 వేల రూపాయల వరకు స్కాలర్షిప్స్ అందించేందుకు గాను సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్స్ ప్రకటన అధికారికంగా జారీ చేశారు. Vidyadhan Scholarship 2025 అనేది sarojini damodaran foundation (SDF) ద్వారా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ మంచి ప్రతిభ కలిగి ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న పదో తరగతి ఆసైన విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో ఒక మంచి విద్యను అభ్యసించడానికి సంబంధించి రూపొందించినటువంటి ప్రోగ్రాం. ఏపీ తెలంగాణలో పదో తరగతి ఉత్తీర్ణత పొందిన ప్రతి ఒక్కరు ఈ పూర్తి సమాచారం చూసి వెంటనే విద్యాదాన్ స్కాలర్షిప్ కి అప్లై చేయండి.

విద్యాదాన్ స్కాలర్షిప్ ముఖ్యమైన వివరాలు:

Join Whats App Group

  • స్కాలర్షిప్ పేరు: vidyadham scholarship 2025.
  • ఆర్గనైజేషన్ పేరు : Sarojini Damodaran Foundation
  • లభించే స్కాలర్షిప్ ఎంత : సంవత్సరానికి ₹10,000 నుండి 75 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అందిస్తారు
  • ఉండవలసిన అర్హత :2025 లో పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  • కనీసం 90 శాతం మార్పులు ఉండాలి(SC, ST లకు 75% మార్కులు ఉన్నా చాలు)
  • కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి.

ఏ రాష్ట్రాల వారు అర్హులు:

విద్యాదాన్ స్కాలర్షిప్ 2025 కి అప్లై చేయాలి అంటే ఈ క్రింది రాష్ట్రాల వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.

తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అధికారిక డేట్ వచ్చేసింది

  • ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ , ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల వారు అర్హులు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?:

విద్యాదాన్ 2025 స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.

  1. ముందుగా https://www.vidyadhan.org/apply వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. రిజిస్టర్ లేదా లాగిన్ అవ్వండి
  3. ప్రొఫైల్ డీటెయిల్స్ పూర్తి చేయండి
  4. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
  5. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి

కావలసిన డాక్యుమెంట్స్:

విద్యాదాన్ స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకున్న విద్యార్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి

  • పదో తరగతి మార్క్స్ మెమో (2025 ది)
  • ఆధార్ సర్టిఫికేషన్
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • ఆధార్ కార్డు లేదా ఐడెంటిటీ గ్రూప్

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

  • ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వారి దరఖాస్తు ఫారాలని షార్ట్ లిస్టు చేస్తారు
  • ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ కి ఎంపిక చేయడం జరుగుతుంది

స్కాలర్షిప్ ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 30th జూన్, 2025
  • ఆన్లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ: 13th జూలై, 2025
  • ఇంటర్వ్యూలు నిర్వహించేది : 19th జూలై నుండి 31st జూలై 2025
  • Apply Online: Official Website

విద్యాదాన్ స్కాలర్షిప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ఇంటర్ నుండి డిగ్రీ చదువుల వరకు పూర్తి స్కాలర్షిప్ పొందవచ్చు
  • ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాకుండా మెంటర్షిప్ మరియు లీడర్షిప్ ట్రైనింగ్ కూడా ఇస్తారు
  • దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తారు

ప్రతిభ కలిగిన పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు స్కాలర్షిప్ కి వెంటనే అప్లై చేయండి. మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ స్కాలర్షిప్ మీకు ఎంతగానో సహాయపడతాయి.