TS inter reconding, reverification results 2025:
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2025 రెగ్యులర్ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత, పరీక్ష ఫలితాల్లో సందేహాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫలితాలకు సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు అప్లై చేసుకున్న వారి యొక్క ఫలితాలను విడుదల చేశారు. మీరు అప్లై చేసి ఉన్నట్లయితే వెంటనే ఫలితాలను చెక్ చేసుకోండి. అధికారిక వెబ్సైట్లో రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ రిజల్ట్స్ యొక్క లింక్స్ ని బోర్డు వారు ఆక్టివేట్ చేశారు.
ప్రధానమైన విషయాలు(Imp. Highlights):
బోర్డు: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
విషయం: రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ ఫలితాలు విడుదల
అధికారిక వెబ్సైట్ : https://tgbie.cgg.gov.in/
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కి అప్లై చేసుకున్న విద్యార్థులు ఇక్కడ ఎందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ డేట్స్ విడుదల
- అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఫలితాలు అనే ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
- మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క ఫలితాలు చూపించడం జరుగుతుంది.
- మీ రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ అప్లై చేస్తే నా తర్వాత అంతకుముందు వచ్చినటువంటి మార్పులకి ఇప్పుడొచ్చిన మార్పుల్లో ఏమైనా తేడా ఉందా లేదా అనేది గమనించండి.
ఫలితాలు యొక్క ప్రాముఖ్యత?:
రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఫలితాలు ఏమైనా మార్పులు వచ్చినట్లయితే, మీకు కొత్త మార్క్స్ మెమో, కొత్త మార్కులతో రావడం జరుగుతుంది. మీ ఇంటర్ యొక్క మొత్తం శాతంలో తేడా గమనించవచ్చు. మీ పాస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. డిగ్రీ లేదా ఇతర పోటీ పరీక్షల యొక్క అడ్మిషన్లకు ఈ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ లేదా మార్క్స్ మెమోస్ మీకు ఉపయోగపడతాయి.
ఫలితాలు చూసుకునే క్రమంలో గాని లేదా ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా సాంకేతిక సమస్యలు మీరు గమనించినట్లయితే TGBIE కి లేదా మీ కాలేజీని సంప్రదించండి.