తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది: తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు – వెంటనే పూర్తి వివరాలు చూడండి

Telangana schools reopen date official:

తెలంగాణ ప్రభుత్వం స్కూల్ రీఓపెన్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల జూన్ 12 2025వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అదే రోజు నుంచి విద్యార్థులకు పాఠాలు మరియు ఆక్టివిటీస్ ప్రారంభించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 12న ఎందుకు రీఓపెన్ చేస్తున్నారు?:

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాల మేరకు జూన్ ఆరో తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా విద్యా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించాలని విద్యా శాఖకు తెలిపింది. ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే

Join Whats App Group

  • మహిళా సంఘాలు
  • స్కూల్ కమిటీలు
  • టీచర్లు మరియు హెడ్మాస్టర్లు
  • పేరెంట్స్ ప్యానెల్స్ (PTMs)
  • అందరూ కలిసి ఈ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని విద్యా శాఖకు సూచించింది ప్రభుత్వం

ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రారంభం:

జూన్ 7, 2025వ తేదీ నుండి ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో

ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మరో 46 రోజులు సెలవులు పొడిగించారు

  • ఇంటింటి ప్రచారం
  • అడ్మిషన్ డ్రైవ్
  • స్థానికంగా ఉన్న నాయకుల మద్దతుతో అవగాహన కార్యక్రమాలు

వీటి ద్వారా పాఠశాలలకు తిరిగి మొగ్గు చూపేలా చేయనున్నారు.

తల్లిదండ్రులకు సూచనలు:

తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల స్కూల్ రీఓపెన్ వివరాలను ముందుగానే తెలుసుకొని జూన్ 12వ తేదీన స్కూల్ కి పిల్లల్ని పంపించే విధంగా సిద్ధం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలకు కావలసిన యూనిఫాం, పుస్తకాలు మరియు బ్యాగులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ముఖ్యమైన స్కూల్ రీఓపెన్ మరియు ఇతర తేదీలు:

  • జూన్ 6 నుండి 19 వరకు: అడ్మిషన్ డ్రైవ్, ప్రచారం నిర్వహించాలి
  • జూన్ 7వ తేదీ : ఇంటింటి ప్రచారం ప్రారంభించాలి
  • జూన్ 12వ తేదీ : స్కూల్ రీఓపెన్ అయ్యే డేట్
  • జూన్ 19వ తేదీ : ప్రచార కార్యక్రమం ముగింపు.

తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, స్కూల్ కి పిల్లలు వచ్చి హాజరయ్యే విధంగా చేయాలని నిర్ణయించుకుంది. విద్యార్థులు మరియు చిన్నారుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయులు సహకరించాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలనిసూచించింది.