JEE Advanced 2025 Exam : Paper 1&2 Analysis : Download Answer Key & Response Sheets

JEE Advanced 2025 Exam:

జేఈఈ అడ్వాన్స్ 2025 పేపర్ 1, పేపర్ 2 ఈరోజు ఉదయం అలాగే సాయంత్రం షిఫ్టుల్లో ప్రశాంతంగా పరీక్షల ముగిసాయి. మొత్తం దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారు పేపర్ 1 అలాగే పేపర్ 2 ప్రశ్నపత్రం యొక్క కఠినత్వం, అడిగిన ప్రశ్నల గురించి కొన్ని మీడియా ఛానల్స్ తో చర్చించడం జరిగింది. ఇందులో పేపర్ వన్ అలాగే పేపర్ 2 రెండూ కూడా చాలా కష్టంగా వచ్చినట్లుగా విద్యార్థులు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కి విడుదలపై ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ వారు స్పందించారు. పరీక్ష రాసిన విద్యార్థుల యొక్క రెస్పాన్స్ షీట్ ని మే 22వ తేదీన విడుదల చేస్తారు. ప్రొఫెషనల్ ఆన్సర్ కి మే 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఫైనల్ ఆన్సర్ కి జూన్ రెండవ తేదీన విడుదల చేయనున్నారు. జై అడ్వాన్స్ పరీక్ష యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Paper 1 and paper 2 analysis:

జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష పేపర్ 1 మరియు పేపర్ 2 రాసిన విద్యార్థులు ప్రశ్న పత్రాలు చాలా కఠినంగా వచ్చాయని తెలిపారు. కొన్ని ప్రశ్నలు అయితే అసలు సాల్వ్ చేయలేని విధంగా ఉన్నాయని, మొత్తంగా చూసుకుంటే ప్రశ్నపత్రం చాలా కఠినంగానే ఉందని తెలపడం జరిగింది.

Join Whats App Group

JEE Advanced Important Dates:

JEE అడ్వాన్సు రాత పరీక్ష రాసిన విద్యార్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇక్కడే విధంగా ఉన్నాయి.

  • క్యాండిడేట్స్ రెస్పాన్స్ స్వీట్స్ డౌన్లోడ్ తేదీ: 22nd మే, 2025
  • ప్రొఫెషనల్ ఆన్సర్ కి డౌన్లోడ్ తేదీ: 26th మే, 2025
  • ఆన్సర్ కిని ఛాలెంజ్ చేసే విండో ఓపెన్ చేసే తేదీ :మే 26-27, 2025
  • ఫైనల్ ఆన్సర్ కి విడుదల తేదీ : జూన్ 2, 2025

How To Download Response Sheets:

జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్ష రాసిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా వారు రాసిన పరీక్ష పేపర్ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ స్కూల్స్ రీ ఓపెన్ డేట్ వచ్చేసింది

  1. ముందుగా జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ (https://jeeadv.ac.in/) ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. మీ హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే మీ పరీక్ష యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది.

రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆన్సర్ కీ విడుదల చేశాక మీరు అబ్జెక్షన్స్ పెట్టుకున్నట్లైతే మీకు మార్క్స్ కలుస్తాయి.

JEE Advanced 2025 : Download Response sheet & Answer keys

FAQ’s:

1. JEE అడ్వాన్స్ 2025 పరీక్ష రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?

https://jeeadv.ac.in ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

2. JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఎంత మంది రాశారు?

2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.