AP Inter Supplementary Exams 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను మే నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షిఫ్ట్లవారిగా మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో అనగానే 20వ తేదీకి పరీక్షలు పూర్తవుతాయి. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనేదానికి విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొన్నది. ఫలితాలను మే 4 వారంలోగా అనగా మే 30వ తేదీలోగా విడుదల చేయడం జరుగుతుంది ఫోటో ఇంటర్మీడియట్ అధికారులు తెలియజేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు ఫీజు చెల్లించారు. కొంతమంది విద్యార్థులు మార్కులను పెంచుకోవడానికి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తుంటే, మరి కొంతమంది ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందువల్ల పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూద్దాం.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షల ఫలితాలను మే నెల నాలుగో వారంలో అనగా మే 30వ తేదీలలో విడుదల చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి, మే నెల 20వ తేదీ నాటికి పరీక్షలు పూర్తవుతాయి.
ఏపీ ఎంసెట్ 2025 లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్
ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.
- ముందుగా ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ https://www.bieap-gov.org/ ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి
- విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి
సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కుల వివరాలు క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
AP Inter Supplementary Results : Website Link
FAQ’s:
1. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల ఎప్పుడు?
మే నెల నాలుగో వారంలో అనగా మే 30వ తేదీల్లోగా ఫలితాలు విడుదల చేయనున్నారు.