తెలంగాణ’హైడ్రా’లో 200 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల : అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ విధానం

TS ‘HYDRA’ Outsourcing Jobs:

తెలంగాణలోని హైడ్రా సంస్థ ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ) నుండి 2 డ్రైవర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని బట్టి చేయడానికి ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణలో గత పోలీసు రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని , ఫైనల్ రాత పరీక్ష రాసి సెలెక్ట్ కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ హైడ్రా ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 19 -05-2025 నుండి 21-5-2025 వరకు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు నందు గల హైడ్రా MT ఆఫీస్ నందు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల యొక్క అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి:

తెలంగాణలోని హైదరాబాద్ హైడ్రా డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

  • మొత్తం పోస్టుల సంఖ్య : 200
  • అర్హతలు: తెలంగాణలో గతంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఫైనల్ రాత పరీక్ష రాసి, ఎంపిక కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఉద్యోగం పేరు: డ్రైవర్ పోస్టులు
  • పర్మినెంట్ లేదా టెంపరరీ?: ఔట్సోర్సింగ్ విధానంలో ఈ 200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • ఎంత జీతం ఉంటుంది: విడుదలైన ప్రకటనలో జీతం వివరాలు తెలుపలేదు. సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీసుకు వెళ్లి వివరాలు తెలుసుకోగలరు.
  • సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవుట్సోర్సింగ్ విధానంలో ఈ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
  • శాలరీ ఎంత ఉంటుంది?: శాలరీ వివరాలు తెలుపలేదు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19th మే, 2025.
  • దరఖాస్తులు ఆఖరి తేదీ : 21st మే, 2025
  • దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు

అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్:

అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను హైడ్రా ఎం. టి ఆఫీస్ నందు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల్లోగా పైన తెలిపిన తేదీలలోగా దరఖాస్తులు పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.

Notification PDF

Website Link

FAQ’s:

1. నేను గతంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు అప్లై చేసి ఫైనల్ పరీక్ష వరకు వెళ్లలేదు. నేను ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చా?

లేదు. ఈ ఉద్యోగాలకు పోలీసులు రిక్రూట్మెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాసి అర్హత పొందని అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

2. హైడ్రా నుండి విడుదలైన 200 అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తారా?

ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తున్నారు పర్మినెంట్ చేసే అవకాశం లేదు.