TS Polycet 2025 Marks vs Rank:
తెలంగాణ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఏ ర్యాంకు వస్తుందో ఇప్పుడే ఒక సెకండ్ లో తెలుసుకునే విధంగా పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ 2025 రాత పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా లక్ష మంది వరకు విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడం జరిగింది. మే 15వ తేదీ వరకు విద్యార్థి నుండి ప్రాథమిక కీకు సంబంధించిన అబ్జెక్షన్స్ స్వీకరించారు. రెండు లేదా మూడు రోజుల్లో ఫైనల్ కీ విడుదల చేసి మే 25వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డ్ విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విద్యార్థులు మీకు ప్రాథమిక కీలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా ర్యాంక్ ఎంత వస్తుందో చాలా సింపుల్ గా తెలుసుకోండి.
Marks vs Rank Analysis:
తెలంగాణ పాలిసెట్ 2025 ప్రాథమిక కీలో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఏ ర్యాంకు వస్తుందో ఈ క్రింది టేబుల్ చూసి తెలుసుకోండి.
| TS Polycet Marks | Marks Wise Rank |
| 115 – 120 | 1-5 |
| 110-115 | 6-15 |
| 105-110 | 16-100 |
| 100-105 | 101-500 |
| 90-100 | 501-1500 |
| 80-90 | 1501-3000 |
| 70-80 | 3001-7000 |
| 60-70 | 7001-20000 |
| 50-60 | 20001-60000 |
| 40-50 | 60001-100000 |
| 30-40 | 100001- 110000 |
| 1-30 | 110001- Last |
ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ:
తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ మే 25వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి యొక్క ర్యాంక్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఇదే
తెలంగాణ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
తెలంగాణ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ పాలీసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- హోమ్ పేజీలో తెలంగాణ పాలిసెట్ 2025 డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
1. తెలంగాణ పాలిసెట్ 2025లో ఎన్ని మార్కులు వస్తే మంచిర్యాంకు వస్తుంది?
ప్రాథమిక కిలో విద్యార్థులకు వచ్చిన మార్పులు ఆధారంగా ఏ ర్యాంక్వస్తుందో పైన తెలిపిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
2. తెలంగాణ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డు విడుదల తేదీ?
మే 25వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. అప్పుడు విద్యార్థులు వారి యొక్క ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
