TS POLYCET 2025 Final Results: How To Download Rank Card @https://www.polycet.sbtet.telangana.gov.in/

TS POLYCET 2025 Final Results:

తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ 2025 రాత పరీక్ష నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షకు దాదాపుగా లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 14వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి మే 15వ తేదీ సాయంత్రం వరకు అబ్జెక్షన్ పెట్టుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులకు రెండు లేదా మూడు రోజుల్లో ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన తర్వాత విద్యార్థులు అధికారికి వెబ్సైట్ నుండి వారి యొక్క ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 25వ తేదీ తర్వాత తెలంగాణ పాలీసెట్ 2025 కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫైనల్ రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం.

తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ డేట్:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 25వ తేదీన ఉదయం విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి అబ్జెక్షన్స్ స్వీకరించిన అధికారులు ఫైనల్ కీ విడుదల చేసి ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Join Whats App Group

ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ యొక్క ర్యాంక్ కార్డ్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  • ముందుగా పాలీసెట్ అధికారిక వెబ్సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోం పేజ్ లో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ 2025 ఆప్షన్పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • వెంటనే మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ర్యాంకు వివరాలు కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.

TS POLYCET 2025: Official Website

FAQ’s:

1. తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ?

మే 25వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు.

2. తెలంగాణ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?.

https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి.