TS అగ్రికల్చర్, హార్టీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకి 22న నోటిఫికేషన్: కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే

TS EAPCET Admissions 2025 Notification:

తెలంగాణలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల అనగా మే 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఫలితాలలో ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మొత్తం 1700 కి పైగా సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఇందులో 80% సీట్లను తెలంగాణలోని విద్యార్థులు చేత భర్తీ చేస్తారు. మిగిలిన 20 శాతం సీట్లను అఖిల భారత స్థాయిలో భర్తీ చేయడం జరుగుతుంది. నీట్ పరీక్షతో సంబంధం లేకుండా అడ్మిషన్ జరుగుతాయని ఉన్నత విద్యాశాఖ తెలియజేసింది. మే 22న నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థుల నుండి దరఖాస్తు కోరిన తర్వాత సర్టిఫికెట్స్ పరిశీలన చేసి సంబంధిత కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు. ఈ అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం

తెలంగాణ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల తేదీ :

మే నెల 22వ తేదీన తెలంగాణ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ కోర్సుల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్స్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఈ ఏపీ సెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అడ్మిషన్స్ కి హాజరు కావలెను.

Join What’s App Group

కావలసిన సర్టిఫికెట్స్ లిస్ట్ :

తెలంగాణ ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల కోసం అడ్మిషన్స్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

  • తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్
  • తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్
  • ఆధార్ కార్డ్
  • టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో
  • ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  • ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  • ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
  • క్యాస్ట్ లేదా కుల ధ్రువీకరణ పత్రాలు.

Official Website

FAQ’s:

1. తెలంగాణ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు?

మే 22వ తేదీన విడుదల చేయనున్నారు.

2. తెలంగాణ విద్యార్థులకు మొత్తం ఎంత శాతం సీట్లు కేటాయిస్తారు?

మొత్తం 80% సీట్లు కేటాయిస్తారు. 1700 సీట్లు అందుబాటులో ఉన్నాయి.