RRB NTPC Graduate Level Admit Card 2025 Link : Exam Date, Hall Ticket Download

RRB NTPC Graduate Level Admit Card 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC Exams 2025) గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ని విడుదల చేసింది. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే నెల 14వ తేదీ నుండి అప్లికేషన్ స్టేటస్ చూసుకునే విధంగా అన్ని ఆర్ఆర్బీలలో లింక్స్ ఆక్టివేట్ చేయడం జరిగింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష స్టేజ్ వన్ పరీక్షలను జూన్ 5వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించినట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు పరీక్షల షెడ్యూల్లో తెలిపారు. మే నెల 27వ తేదీ నుండి అభ్యర్థుల యొక్క రాత పరీక్ష తేదీ, రాత పరీక్షసెంటర్, సిటీ, రైల్వే ట్రావెల్ టికెట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్స్ ని అభ్యర్థి యొక్క పరీక్షకు కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆదారిత రాత పరీక్ష ని జూన్ 5వ తేదీ నుండి షిఫ్టుల వారీగా దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.

RRB NTPC పరీక్షల షెడ్యూల్ ఇదే:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB NTPC 2025) గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను రాయబోయే అభ్యర్థులు ఈ క్రింది షెడ్యూల్ ని తప్పనిసరిగా తెలుసుకోండి.

Join Whats App Group

  • RRB NTPC 2025 అప్లికేషన్ స్టేటస్ ఎప్పటినుండి చూసుకోవాలి : మే 14, 2025
  • రాత పరీక్ష తేది, పరీక్ష సెంటర్, పరీక్ష రాసే సిటీ వివరాలు యొక్క లింక్ ఎప్పుడు ఆక్టివేట్ అవుతుంది : మే 27, 2025
  • అడ్మిట్ కార్డ్స్ లేదా హాల్ టికెట్స్ ఎప్పటినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.: అభ్యర్థి యొక్క పరీక్ష తేదీకి కరెక్టుగా నాలుగు రోజుల ముందు నుండి హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.

RRB NTPC 2025 అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

రైల్వే ఎన్ టి పి సి 2025 కంప్యూటర్ ఆదారిత రాత పరీక్ష స్టేజ్ వన్ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. అధికారిక వెబ్సైట్ https://rrbsecunderabad.gov.in/ ఓపెన్ చేయండి.
  2. హోమ్ పేజీలో రైల్వే ఎన్ టి పి సి 2025 అడ్మిట్ కార్డ్స్ ఆప్షన్ తో క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి

RRB NTPC 2025 పరీక్ష విధానం ఏమిటి?:

రైల్వే ఎన్ టి పి సి 2025 కంప్యూటర్ ఆదారిత పరీక్షలో ఈ క్రింది టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

  • ఆప్టిట్యూడ్ లేదా మ్యాథమెటికల్ ఎబిలిటీస్ : 30 ప్రశ్నలు – 30 మార్కులు.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ : 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ : 40 ప్రశ్నలు – 40 మార్కులు

1/3 వ వంతు నెగిటివ్ మార్క్స్ ఉన్నందున అభ్యర్థులు చాలా జాగ్రత్తగా పరీక్ష రాయవలెను.

RRB NTPC 2025: Application Status

RRB NTPC 2025 : Website Link

FAQ’s:

1. రైల్వే ఎన్ టి పి సి 2025 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఎప్పుడు?

జూన్ 5వ తేదీ నుండి జూన్ 23వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరగనున్నాయి

2. రైల్వే ఎన్ టి పి సి 2025 పరీక్షల యొక్క హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ఎప్పటినుండి డౌన్లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థుల యొక్క పరీక్షకు కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు నుండి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవలెను

3. రైల్వే ఎన్టిపిసి 2025 రాత పరీక్ష మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది?

మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది 90 నిమిషాలు సమయం కేటాయిస్తారు.