AP POLYCET 2025 Results:
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 14వ తేదీ సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఇందులో 95.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. మొత్తం 1,39,840 మంది ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష రాయగా, అందులో 1,33,358 మంది ఉత్తీర్ణులయ్యారు. 120 కి 120 మార్కులు 19 మంది విద్యార్థులకు వచ్చాయని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ పాలీసెట్ 2025 పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ప్రవేశాల ప్రక్రియ మరియు ఇతర సమాచారం కోసం తరచుగా అధికారిక వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండాలని తెలిపారు. కౌన్సిలింగ్ కి కావాల్సిన సర్టిఫికెట్లు మరియు ఇతర పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ డేట్స్:
ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ త్వరలో కౌన్సిలింగ్ ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలన చేయడం జరుగుతుందని విద్యాశాఖ తెలిపింది. మే నెల చివరి వారంలో కౌన్సిలింగ్ తేదీలు యొక్క నోటిఫికేషన్ మరియు డేట్స్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ పాలీసెట్ లో ర్యాంకును బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందో వెంటనే తెలుసుకోండి
కౌన్సిలింగ్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యే విద్యార్థులు చెప్పింది తెలిపిన సర్టిఫికెట్స్ కచ్చితంగా కలిగి ఉండాలి.
- ఏపీ పాలిసెట్ హాల్ టికెట్
- ఏపీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్
- ఆధార్ కార్డ్
- పదో తరగతి మార్క్స్ మెమో
- పదో తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP పాలిసెట్ 2025 ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 14వ తేదీ సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు.పరీక్ష రాసిన విద్యార్థులు ఈ క్రింది విధంగా ఫలితాలను చెక్ చేసుకోండి.
- ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్సైట్ https://polycetap.nic.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్లో ఉన్న ఏపీ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి
- విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే రాంక్ కార్డు స్క్రీన్ పైన కనిపిస్తుంది.
FAQ’S:
1. ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఫలితాలు విడుదల చేసి ఒక్కరోజే అయింది కాబట్టి పాలీసెట్ కౌన్సిలింగ్ ని త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. అధికారిక డేట్ కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి
2. ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి.?
https://polycetap.nic.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోండి
