TS Inter Supplementary Exams 2025:
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లమెంటరీ రాత పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలకు 4.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా మే మూడో వారంలో అనగా మే 15వ తేదీ తర్వాత హాల్ టికెట్స్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మొత్తం ఎనిమిది వందల తొంబై రెండు సెంటర్లలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వివరాలను ఇప్పుడు చూద్దాం.
హాల్ టికెట్స్ ని ఎప్పుడు విడుదల చేస్తారు?:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని మే నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు అంటే మే 15వ తేదీ తర్వాత అధికారిక వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ఆక్టివేట్ అయిన వెంటనే వారి యొక్క సొంత మొబైల్ లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ (https://tgbie.cgg.gov.in/) ఓపెన్ చేయండి.
- హోం పేజ్ లో “TS inter supplementary exams 2025 hall tickets download ” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క రూల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి.
- విద్యార్థులకు హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవండి.
TS Inter Hall Tickets Download Website
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?
సప్లిమెంటరీ పరీక్షలు హాల్ టికెట్స్ ని మే నెల మూడో వారంలో విడుదల చేయడం జరుగుతుంది
2. సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని ఏ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి?
https://tgbie.cgg.gov.in ఈ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.