TS EAMCET 2025 Counselling Dates:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు కొద్దిరోజుల క్రితం అధికారికంగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ క్లాస్ ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు అధికారిక సమాచారం ఇవ్వడం జరిగింది. ముందుగా వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోసం ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ని ఈ నెలలోనే జారీ చేసి, జూన్ నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇంకా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ముందుగా ఐఐటి, ఎన్ఐటీలు, ఐఐఐటిల్లో ప్రవేశాలకు సంబంధించి జోసా నోటిఫికేషన్ విడుదలై వాటి యొక్క కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ విడుదల చేస్తారు. ముందుగానే ఎంసెట్ కౌన్సిలింగ్ చేపడితే జోస కౌన్సిలింగ్ ద్వారా ఆ తర్వాత ఐఐటి, ఎన్ఐటీలలో సీడ్స్ వచ్చినవాళ్లు ఈ ఎంసెట్ సీట్స్ వదులుకునే అవకాశం ఉంటుంది కావున జోస కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. అందువల్ల జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టులో క్లాసులు ప్రారంభించనున్నారు.
తెలంగాణా ఎంసెట్ కౌన్సిలింగ్ కు కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు :
తెలంగాణ పోలీసెట్ 2025 కౌన్సిలింగ్ కి హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా రెడీ చేసుకోవాలి.
- తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్
- తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్
- ఆధార్ కార్డ్
- 10th/ssc మార్క్స్ లిస్ట్
- ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- ఇన్కమ్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- రెసిడెన్సి సర్టిఫికెట్
- వికలాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికెట్
TS EAMCET అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కౌన్సిలింగ్ డేట్స్ :
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ అలాగే పశు వైద్య కళాశాలలో డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మే నెల చివర్లో విడుదల చేసి, జూన్లో కౌన్సిలింగ్ నిర్వహించి జూలై నెలలో తరగతులు ప్రారంభించనున్నారు.
TS EAMCET ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ :
తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసి జూలైలో కౌన్సిలింగ్ ని పూర్తి చేసి ఆగస్టు నెలలో క్లాసులు ప్రారంభించనున్నారు.
TS EAMCET Counseling Dates : Official Website
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు?
తెలంగాణ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జూన్ మరియు జూలైలో నిర్వహించడం జరుగుతుంది.