TS POLYCET 2025 Results Declared:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ఏపీ పాలీసెట్ 2025 పరీక్షలను 1.39 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారి యొక్క ఫలితాలను చూసుకునే విధంగా ఈరోజు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసి, అధికారిక పాలీసెట్ వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన మొత్తం 120 మార్కులకు సంబంధించి ఏపీ పాలీసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్ష నిర్వహించారు. మే నెల ఆరో తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి మే 10వ తేదీన ఫైనల్ కీ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ చూసుకున్న విద్యార్థుల్లో చాలామందికి 120 కి 120 మార్కులు రావడం జరిగింది. అయితే ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల్లో మీకు చాలా తక్కువ ర్యాంకు వచ్చినా లేదా ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో మీకు సీటు వస్తుందో వెంటనే కాలేజీ ప్రిడిక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో చూద్దాం.
AP పాలీసెట్ 2025 Rank vs College:
ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాల్లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా మీరు ముందుగానే కాలేజ్ వివరాలను తెలుసుకోవచ్చు.

- ముందుగా విద్యార్థులు ఈ (Rank vs College Predictor)వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అందులో మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, జెండర్ సెలెక్ట్ చేసుకుని, స్టేట్ సెలక్ట్ చేసుకుని ప్రెడిక్ట్ రిజల్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
- వెంటనే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుందో, ఆ కాలేజీల లిస్ట్ మీకు కనిపిస్తుంది.
- ఈ విధంగా మీరు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవచ్చు.
ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ పోలీస్ సెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఇంకా చూసుకొని అభ్యర్థులు ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.
- ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక (https://polycetap.nic.in/ ) వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అక్కడ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే మీ యొక్క ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
AP POLYCET 2025 Rank vs College Predictor Website
AP POLYCET 2025 Final Results Website
FAQ’s:
1. ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?
ఈ https://polycetap.nic.in/ వెబ్సైట్లో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు.
2. ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలుపెడతారు?
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇంకా వెల్లడించలేదు త్వరలో తేదీలను వెల్లడించడం జరుగుతుంది.