TS POLYCET Answer Key 2025: Download Answer Key & Raise Objections @polycet.sbtet.telangana.gov.in

TS POLYCET Answer Key 2025:

తెలంగాణలోని డిప్లమా కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షను ఈరోజు అధికారికంగా నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ రాత పరీక్షకు 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించారు. అయితే పాలీసెట్ పరీక్షకు సంబంధించి ఆన్సర్ కీ ని పది రోజుల తర్వాత అనగా మే 23వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్సర్ కి విడుదలైన తర్వాత విద్యార్థులు ఆ ప్రశ్న పత్రంలో ఆన్సర్స్ కి సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ఆ తప్పులకి సంబంధించి ఫీజు చెల్లించి అబ్జెక్షన్స్ పెట్టుకున్నట్లైతే విద్యార్థులకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వారు ఫైనల్ కీ ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఈ పాలీసెట్ కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి మే 31వ తేదీ వరకు పట్టవచ్చని అధికారులు తెలియజేశారు.

TS పాలీసెట్ ఆన్సర్ కి విడుదల తేదీ:

తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షలు ఈరోజు ముగిసాయి. పాలీసెట్ ఆన్సర్ కీ ని 10 రోజుల తర్వాత అనగా మే 23వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Join Whats App Group

TS పాలీసెట్ 2025 ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేయాలి?:

తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ప్రశ్నపత్రానికి సంబంధించిన ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక పాలీసెట్ వెబ్సైట్ (http://polycet.sbtet.telangana.gov.in/) ఓపెన్ చేయాలి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ఆన్సర్ కి QP Code A/B/C/D of Polycet 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఆన్సర్స్ తో కూడిన కి ఉన్నటువంటి పిడిఎఫ్ ఫైల్ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది.
  4. ఆన్సర్ కి పిడిఎఫ్ లో ఇచ్చిన ఆన్సర్లు మరియు విద్యార్థులు పెట్టినటువంటి ఆన్సర్స్ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
  5. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఆన్సర్ కీ లో తప్పులు ఏమైనా గమనించినట్లయితే, వాటికి సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు అధ్యక్షులు పెట్టుకోవాలి.
  6. అబ్జెక్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.

ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకుని మార్క్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

TS Polycet 2025 Answer Key Website

FAQ’s:

1. తెలంగాణ పాలీసెట్ 2025 ఆన్సర్ కి ని ఎప్పుడు విడుదల చేస్తారు?

ఆన్సర్ కీ ని పది రోజుల తర్వాత అనగా మే 23వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

2. తెలంగాణ పాలిసెట్ 2025 ఆన్సర్ కీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

http://polycet.sbtet.telangana.gov.in/ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.