TS Inter Supplementary Exams 2025:
తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంతవరకు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించినటువంటి వారికి తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు శుభవార్త తెలిపారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఇంతవరకు పరీక్ష ఫీజు చెల్లించినటువంటి విద్యార్థుల కోసం ₹2,500/- ఆలస్య రుసుముతో విద్యార్థులు కళాశాలలో ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు తెలిపారు. కావున ఇంతవరకు ఫీజు చెల్లించని విద్యార్థులు మే 14వ తేదీ సాయంత్రంలోగా ఆలస్యరసముతో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావలెను. అయితే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించి 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా బోర్డు అధికారులు తెలిపారు. మొత్తం 892 పరీక్ష కేంద్రాల్లో సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్ టికెట్స్ ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఆత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 22 నుండి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ (https://tgbie.cgg.gov.in/) ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ అడ్మిట్ కార్డ్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి.
- విద్యార్థులకు రోల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోవాలి
TS Inter Board: Official Website
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఆలస్య రుసుము తేదీని ఎప్పటి వరకు పొడిగించారు?
మే 14వ తేదీ సాయంత్రం వరకు ₹2,500/- ఆలస్యరసముతో ఫీజు చెల్లించాలని.
2. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే తేదీలు ఏమిటి?
మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
3. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?
మే మూడో వారంలో హాల్ టికెట్స్ విడుదల చేస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా కాలేజీల నుండి గాని హాల్ టికెట్స్ పొందవచ్చు.