AP SSC 10th Supplementary Exams 2025:
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. మరి కొద్ది రోజుల్లో నిర్వహించబోయే ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించడం జరిగింది. ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు చేస్తున్నారు. పదవ తరగతి హాల్ టికెట్స్ డౌన్లోడ్ వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.
ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షల యొక్క హాల్ టికెట్స్ ని ఈరోజు ఇప్పుడే విడుదల చేశారు.. మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ ని వారి యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను మే 19వ తేదీ నుండి పేపర్ల వారీగా సబ్జెక్టుల వారీగా మే 28వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ , సైన్స్ సోషల్ హిందీ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్ష ఉంటాయి.
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలయొక్క హాల్ టికెట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- మొదటగా అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో (AP SSC 10th Supplementary Exams 2025 Hall Tickets) ఆప్షన్ బె క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి
- వెంటనే విద్యార్థుల యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ అవుట్ తీసుకోండి
AP 10th Hall Tickets : Official Website
FAQ’s:
1. ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షల తేదీలు ఏమిటి?
మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు
2. ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?.
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఇప్పుడే విడుదల చేశారు.
