తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు వచ్చేసాయి: టాప్ త్రీ ర్యాంకర్లు వీళ్ళే.

TS EAMCET 2025 Results:

ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇప్పుడే విడుదల చేశారు. మొత్తం 2,90,000 వేల మందికి పైగా విద్యార్థులు ఈ తెలంగాణ ఎంసెట్ పరీక్షలు రాయడం జరిగింది. ఇందులో ఫార్మసీ మరియు అగ్రికల్చర్ విద్యార్థులు 87 వేల మంది ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు 2,05,000 మంది వరకు ఉన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ర్యాంక్ కార్డును అధికారిక వెబ్సైట్ నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ విభాగాల్లో టాప్ ర్యాంకర్ల వివరాలను కూడా తెలంగాణ జైఎన్టియు యూనివర్సిటీ వారు విడుదల చేశారు. టాప్ యాంకర్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం .

TS EAMCET 2025 టాపర్స్ వీళ్ళే:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో అత్యధిక మార్పులు తెచ్చుకొని టాపర్స్ గా నిలిచిన విద్యార్థుల యొక్క ర్యాంక్స్ లిస్టు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • ఇంజనీరింగ్ విభాగంలో టాపర్స్:
  • 1). అల్లా భరత్ చంద్ర (పార్వతీపురం మన్యం జిల్లా )
  • 2). ఉదగండ్ల రామచరణ్ రెడ్డి ( రంగారెడ్డి జిల్లా)
  • 3). హేమ సాయి సూర్య కార్తీక్ ( విజయనగరం జిల్లా)
  • అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో టాపర్స్:
  • 1). సాకేత్ రెడ్డి (మేడ్చల్ జిల్లా)
  • 2). లలిత్ వరణ్య (కరీంనగర్ జిల్లా)
  • 3). చాడ అక్షిత్ ( వరంగల్ జిల్లా)

పైన తెలిపిన టాపర్స్ వివరాలు ఇప్పుడే విడుదలైన తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలకు సంబంధించి అత్యధిక మార్కుల వచ్చినటువంటి వారి యొక్క టాపర్స్ లిస్ట్.

TS EAMCET 2025 ఫలితాలు ఎలా చూసుకోవాలి:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను చూసుకునేందుకు అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ (Website Link) లింక్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ పంపేజ్ లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఫలితాలు యొక్క లింక్స్ ఉంటాయి ఆ లింక్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన వెంటనే ఫలితాలు కనిపిస్తాయి.
  5. ఫలితాలు వెంటనే డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఫలితాలు చూస్తున్న విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంక్ కార్డులోని ర్యాంక్ వివరాలను ఇక్కడింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలపండి.

TS EAMCET 2025: Official Website Link

FAQ’s:

1. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?

మే 11 ఉదయం 11 గంటలకి తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు అధికారికంగా విడుదల చేశారు వెంటనే ఫలితాన్ని చెక్ చేసుకోవాలి.

2. ఫలితాలు చూసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?

Official Website లింక్ పై క్లిక్ చేసి వెంటనే ఫలితాలు చూడండి.