TS EAMCET Results 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎంసెట్ ఫలితాలు (TS EAMCET Results 2025) మే 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 29వ తేదీ నుండి మే నాలుగో తేదీ వరకు జరిగాయి. మే ఆరో తేదీ మరియు ఏడో తేదీ వరకు తప్పు సమాధానాలు ఉన్న ప్రశ్నలకు అబ్జెక్షన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను వారి యొక్క మొబైల్ లోనే చూసుకునే విధంగా జెఎన్టియు అధికారులు సౌకర్యం కల్పించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ & సమయం:
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మే 11వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. మొత్తం 2,90,000 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు రాశారు. ఇందులో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులు 87 వేల మంది ఉన్నారు. మిగిలిన రెండు లక్షల ఏడు వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 29, 30 మే 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించారు. TS EAMCET Results 2025 ను అధికారిక వెబ్సైట్లో విద్యార్థుల యొక్క మొబైల్ ఫోన్ లోనే చూసుకోవచ్చు.
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
- అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజీలో “TS EAPCET Results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఫలితాలు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తాయి.
- రిజల్ట్స్ స్కోర్ కార్డు ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS EAMCET 2025 రిజల్ట్స్ చూసుకునే వెబ్సైట్స్ :
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్ ద్వారా చాలా సింపుల్ గా విద్యార్థులు యొక్క రిజల్ట్స్ ని తెలుసుకోవచ్చు.
పైన తెలిపిన వెబ్సైట్స్ లింక్స్ ద్వారా వారి యొక్క ఫలితాలను వెంటనే చెక్ చేసుకోండి. ఫలితాలు చూసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క ఫలితాల వివరాలను వారికి వచ్చినటువంటి మార్కులను ఈ క్రింది కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?
మే 11 ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు
2. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను చూసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://eapcet.tgche.ac.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు
