AP POLYCET 2025 Final Results:
ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం జరిగినటువంటి ఏపీ పాలీసెట్ 2025 కి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కి మరియు అబ్జెక్షన్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ కి ని ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. అయితే ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారనే దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వారు విద్యార్థులకు ఒక శుభవార్త ఇది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 12వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు మే 12వ తేదీ ఉదయం ఫలితాలను వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే చాలా సింపుల్ గా చూసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన పాలీసెట్ ఎంట్రెన్స్ రాత పరీక్షకు మొత్తం 1,45,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలీసెట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో చూద్దాం.
AP POLYCET 2025 Final Results Date:
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం జరిగినటువంటి ఏపీ పాలీసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల ఫైనల్ ఫలితాలను మే 12వ తేదీ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే ఆరో తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి, ప్రాథమిక కీపై విద్యార్థుల అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత మే 10వ తేదీన ఫైనల్ ఆన్సర్ కిని పాలీసెట్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. అయితే ఫలితాలను మే 12వ తేదీ ఉదయం విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
AP పాలీసెట్ 2025 ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఫైనల్ రిజల్ట్స్ ని విద్యార్థులు చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక పాలీసెట్ వెబ్సైట్ (Official Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ అధికారిక హోమ్ పేజీలో ( AP POLYCET 2025 Final Results) ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే విద్యార్థుల యొక్క ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి
- ఫలితాలను డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ పాలీసెట్ కి సంబంధించిన ఫైనల్ కీ ని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని వారి యొక్క స్కోర్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. స్కోర్ చూసుకున్న విద్యార్థులు మీ యొక్క స్కోర్ వివరాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.
AP POLYCET 2025: Official Website
FAQ’s:
1. ఏపీ పోలీఏపీస్ సెట్ 2025 ఆఖరు ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?
మే 12వ తేదీ ఉదయం ఏపీ పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
2. ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలను చూసుకొని అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://polycetap.nic.in లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు వారి యొక్క పాలీసెట్ ఫైనల్ ఫలితాలను చూసుకోవచ్చు.
