AP EAMCET 2025 Hall Tickets:
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఏపీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ని మే 12వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షకి ఇంజనీరింగ్ విభాగంలో 2,19,000+ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 87,000+ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 3,05,000 మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత ప్రశ్న నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ హాల్ టికెట్ వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆర్టికల్లో చూద్దాం.
AP EAMCET 2025 ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది ముఖ్యమైన తేదీలను గమనించగలరు.
- హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీలు : మే 12వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలు జరిగే తేదీ తేదీలు: మే 19వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష తేదీలు : మే 19 మరియు మే 20
- ఇంజనీరింగ్ రాత పరీక్ష తేదీలు : మే 21 నుండి మే 27వ తేదీ వరకు నిర్వహిస్తారు
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ KEY డౌన్లోడ్ చేసుకునే తేదీ : మే 25, 2025
- ఇంజనీరింగ్ పరీక్ష KEY డౌన్లోడ్ చేసుకునే తేదీ: మే 28, 2025
- ఫైనల్ కీ విడుదల చేసే తేదీ : జూన్ 5, 2025
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “AP EAMCET 2025 Hall Tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది
- హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క పేరు, డేట్ అఫ్ బర్త్, రోల్ నెంబర్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి.
Hall Tickets Download: Official Website
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 హాల్ టికెట్స్ ఎప్పటినుండి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు?
మే 12వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు
2. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ కీ విడుదల తేదీ ఎప్పుడు?
ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ కీ ని జూన్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.