Telangana Outsourcing Jobs:
తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా మహేశ్వరంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి 63 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్, వార్డ్ బాయ్, కార్పెంటర్ టైలర్ బార్బర్, ఎలక్ట్రిషన్ ప్లంబర్ థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, ఇతర చాలా రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షాట్లిస్ట్ చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ అర్హతలు వయస్సు పూర్తి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఉద్యోగాల వివరాలు:
తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
| ల్యాబ్ అటెండెట్స్ | 13 |
| రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టీషియన్ | 01 |
| రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ | 04 |
| ఓటి టెక్నీషియన్ | 04 |
| ఎనస్తీషియా టెక్నీషియన్ | 04 |
| డెంటల్ టెక్నీషియన్ | 01 |
| బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ | 04 |
| రికార్డు క్లర్క్ లేదా రికార్డు అసిస్టెంట్ | 01 |
| కేటలోగర్ | 01 |
| మ్యూజియం అసిస్టెంట్ కం ఆర్టిస్ట్ | 01 |
| ఆడియో విజువల్ టెక్నీషియన్ | 01 |
| వార్డ్ బాయ్ | 04 |
| దోబీ లేదా ప్యాకర్ | 03 |
| కార్పెంటర్ | 01 |
| టైలర్ | 03 |
| ఎలక్ట్రీషియన్ | 01 |
| ప్లంబర్ | 03 |
| థియేటర్ అసిస్టెంట్ | 02 |
| గ్యాస్ ఆపరేటర్ | 06 |
| ఈ సి జి టెక్నీషియన్ | 02 |
| బార్బర్ | 03 |
| మొత్తం పోస్టులు | 63 |
పోస్టుల వివరాలు, అర్హతలు:
తెలంగాణలోని మహేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి విడుదలైన 63 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి ఇంటర్ మీడియట్ లేదా 10+2, ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు మెడికల్ సంబంధిత అర్హతలు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST, BC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఐడిబిఐ బ్యాంకుల్లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- OC, ఓబీసీ అభ్యర్థులు: ₹200/- ఫీజు చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు : ₹100/- ఫీజు చెల్లించాలి
- వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు
ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు డిడి రిసిప్ట్ కూడా పంపించాలి.
- అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్: ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం, BIET క్యాంపస్, మంగల్ పల్లి,ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా – 501510 అడ్రస్ కు పంపించాలి
సెలక్షన్ ప్రాసెస్ :
తెలంగాణ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు
- మెరిట్ ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్స్
శాలరీ ఎంత ఉంటుంది?:
తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹22,750/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి
ఎలా అప్లై చేయాలి:
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి
- ఆఫీసియల్ వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని గడువులోగా సంబంధిత డిపార్ట్మెంట్ కి పంపించాలి
- అప్లికేషన్ ఫీజు డీడీ తీసి, డీడీ రిసిప్ట్ కూడా అప్లికేషన్ తో పాటు పంపించాలి
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 1st మే, 2025
- దరఖాస్తు ఆఖరి తేదీ : 10th మే, 2025
- ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ:17th మే, 2025
- అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 19th మే, 2025
FAQ’s:
1. తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్ మొత్తం ఎన్ని ఉద్యోగాలు?
63 ఉద్యోగాలు ఉన్నాయి.
2. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏమిటి?
మే 10వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి.
