ఐడిబిఐ బ్యాంకుల్లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు విడుదల: అస్సలు వదలొద్దు వెంటనే అప్లై చేయండి

IDBI Bank JAM Notification 2025:

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైనటువంటి ఐడిబిఐ బ్యాంకు నుండి 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు అర్హులు. మే 8వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. జూన్ 8వ తేదీన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఐడిబిఐ బ్యాంకు నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఉద్యోగాలు వివరాలు:

ఐడిబిఐ బ్యాంకు నుండి విడుదలైన ఉద్యోగాల వివరాలు క్రింది టేబుల్ లో చూడండి

Join Whats App Group

విడుదల చేసిన సంస్థ ఐడిబిఐ బ్యాంక్
మొత్తం పోస్టులు676
పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
వయస్సు20 నుండి 25 సంవత్సరాలు
ఆఖరి తేదీ20th May, 2025
అధికారిక వెబ్సైట్Website Link

పోస్టుల వివరాలు, అర్హతలు:

ఐడిబిఐ బ్యాంకు నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 676 పోస్టులకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి

ఏపీ జిల్లా కోర్టు 1650 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల: Apply

  • అర్హతలు : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి

ఎంత వయస్సు ఉండాలి :

ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగి ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.

  1. SC, ST, PWD అభ్యర్థులు : ₹250/- ఫీజు చెల్లించాలి
  2. ఇతర అభ్యర్థులు: ₹1,050/- ఫీజు చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్:

ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఈ క్రింద విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  • ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ చేస్తారు
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు
  • పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు

ఎలా అప్లై చేయాలి?:

ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగాలకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ కెరియర్ సెక్షన్ లోకి వెళ్ళండి
  3. అక్కడ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ అప్లై లింక్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి.
  4. అప్లికేషన్ లోని పూర్తి వివరాలు నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  5. ఆఖరుగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

రాత పరీక్ష విధానం:

ఆన్లైన్ కంప్యూటర్ ఆదరి తర్వాత పరీక్షలు ఈ క్రింది టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

  • లాజికల్ రీజనింగ్ & డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ : 60 ప్రశ్నలు – 60 మార్కులు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 40 ప్రశ్నలు – 40 మార్కులు
  • క్వాంటిటివ్ ఆటిట్యూడ్ : 40 ప్రశ్నలు – 40 మార్కులు
  • జనరల్ అవేర్నెస్ : 60 ప్రశ్నలు – 60 మార్కులు

మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది. 0.25 నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : మే 8, 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : మే 20, 2025

Notification PDF

Apply Online

Official Website

FAQ’s:

1. ఐడిబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ మొత్తం పోస్టులు ఎన్ని?

676 పోస్టులు విడుదల చేశారు

2. ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏమిటి?

మే 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి

3. ఐడిబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రాత పరీక్ష తేదీ ఎప్పుడు?

జూన్ 8, 2025.