ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో 1620 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల : అస్సలు వదలొద్దు వెంటనే అప్లై చేయండి

AP District Court Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లా సపోడినేట్ సర్వీసెస్ హోటల్లో పనిచేయడానికి 1620 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ,రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ , కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను అధికారికంగా విడుదల చేశారు. 13 మే,2025 నుండి జూన్ 2nd, 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా నాన్ లోకల్ లో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

కోర్టు జాబ్స్ వివరాలు:

పోస్టులు విడుదల చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు డిపార్ట్మెంట్
మొత్తం పోస్టులు1620
వయస్సు18-42
ఆఖరి తేదీ2nd June
అధికారిక వెబ్సైట్Website Link

పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీలు వివరాలు ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Join What’s App Group

పోస్టుల పేరు ఖాళీల సంఖ్య
జూనియర్ అసిస్టెంట్230
ఆఫీసు సభార్డినేట్651
రికార్డు అసిస్టెంట్24
ప్రాసెస్ సర్వర్164
ఎగ్జామినర్32
ఫీల్డ్ అసిస్టెంట్56
టైపిస్ట్162
కాపీయిస్ట్193
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 380
డ్రైవర్28

పోస్టుల అర్హతలు:

  • జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • రికార్డ్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి
  • ప్రాసెస్ సర్వర్ : పదవ తరగతి పాస్ అయితే చాలు
  • ఆఫీస్ సభార్డినేట్ : సెవెంత్ లేదా టెన్త్ అర్హత కలిగి , హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండకూడదు
  • డ్రైవర్ పోస్టులు : సెవెంత్ లేదా టెన్త్ అర్హత కలిగి, LMV లైసెన్స్ కలిగి ఉండాలి. మూడు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి
  • ఎగ్జామినర్ : ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి
  • ఫీల్డ్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి
  • టైపిస్ట్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • కాపియిస్ట్ : ఇంటర్మీడియట్ అర్హతతో పాటు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లీషులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ కలిగి ఉండి, స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.

ఎంత వయసు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, SR, OBC, EWS అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

what’sApp ఇకపై ఈ ఫోన్లలో పని చేయదు

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు OC, EWS, OBC అభ్యర్థులు 800/- ఫీజు ప్రతి పోస్ట్ కి అప్లై చేసేటప్పుడు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వారి అప్లికేషన్స్ scrutiny చేస్తారు
  2. ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  4. ఫైనల్ గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13/05/2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ: 02/06/2025

ఎలా అప్లై చేయాలి:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోట ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. ప్రతి అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటిపిఆర్ఐడి పొందాలి
  3. తర్వాత అప్లికేషన్ కి లాగిన్ అయ్యి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి
  5. అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి

Notification PDFs

Official Website

FAQ’s:

1. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరికి ఏది ఏమిటి?

2nd June 2025

2. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఉండవలసిన అర్హతలు ఏమిటి?

7th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు ఉండాలి.

3. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

Official Website వెబ్సైట్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.