CBSE 10th, 12th Results 2025 Date:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదవ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలో రాసినటువంటి 44 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు విడుదల కావడానికి ఆలస్యమైనందున విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఫలితాలు విడుదల చేయాలని బోర్డుని కోరుతున్నారు. మే ఆరో తేదీ ఫలితాలు విడుదల చేస్తారని వచ్చినటువంటి వార్తలు అవాస్తవం అని తెలిసిన తర్వాత ఫలితాలు విడుదల అఫీషియల్ డేట్ కోసం చూస్తున్న విద్యార్థులకు బోర్డు వారు శుభవార్త తెలిపారు. మే రెండవ వారంలో సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. సీబీఎస్ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
ఫలితాలు విడుదల ఎప్పుడు?:
సీబీఎస్ఈ బోర్డు టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. మే 7వ తేదీ నుండి 14వ తేదీ మధ్య ఏదో ఒక రోజు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు ఆలస్యం అయినందున త్వరితగతను ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
CBSE ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
సీబీఎస్ఈ టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలను చూసుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చాలా సింపుల్ గా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో CBSE 10th & 12th Results ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- స్క్రీన్ పైన రిజల్ట్స్ కనిపిస్తాయి.
- వెంటనే డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి
CBSE Results 2025 అఫీషియల్ వెబ్ సైట్స్:
సీబీఎస్ఈ ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్స్ లో చెక్ చేసుకోండి
- https://www.cbse.gov.in/
- https://results.cbse.nic.in
- Digilocker వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి ఫలితాలు వెంటనే చూసుకోవచ్చు.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
సీబీఎస్ఈ ఫలితాలు చూసుకుని విద్యార్థులు ఈ క్రింది సూచనలు పాటించండి.
- ఫలితాలు చూసుకునేటప్పుడు ఒకేసారి కొన్ని లక్షల మంది విద్యార్థులు వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అయ్యి వెబ్సైట్ ఓపెన్ అవ్వటం చాలా స్లో అవుతుంది. కావున కొంత ఓపికతో ఫలితాలు చూసుకోవాలి
- ఫలితాలు స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు
- ఒరిజినల్ మార్క్ షీట్ ను తర్వాత స్కూల్ నుంచి పొందవచ్చు.
సీబీఎస్ఈ ఫలితాల విడుదల కి సంబంధించి అధికారిక తేదీ వచ్చిన వెంటనే మా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మా వెబ్సైట్ని వెంటనే బుక్ మార్క్ చేసుకోండి.
FAQ’s:
1. సీబీఎస్ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
మే రెండో వారంలో సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది
2. సీబీఎస్ఈ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://results.cbse.nic.in వెబ్సైట్ లో మీ ఫలితాలను చూసుకోవచ్చు
