CBSE Board Results 2025:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టెన్త్ మరియు 12th ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక శుభవార్త. ఎట్టకేలకు టెన్త్ మరియు 12th పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. CBSE Results 2025 కి సంబంధించి ఫలితాలు విడుదల తేదీ మరియు టైమింగ్ పై అధికారికంగా తాజా సమాచారం వచ్చింది. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడండి.
CBSE ఫలితాలు విడుదలయ్యే తేదీలు:
సీబీఎస్ఈ టెన్త్ మరియు 12th ఫలితాల విడుదల తేదీ మరియు టైమింగ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- CBSE పదవ తరగతి ఫలితాలు (Class 10) తేదీ: మే 13 లేదా 14, 2025 మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే.
- CBSE 12వ తరగతి ఫలితాలు (Class 12) తేదీ: ఈ పరీక్ష ఫలితాలు కూడా మే 13 లేదా 14 2025 మధ్యాహ్నం 12 గంటల తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫలితాల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం చూడాల్సి ఉంది.
ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్స్ :
సీబీఎస్ఈ టెన్త్ మరియు 12th ఫలితాలు విడుదలైన తర్వాత ఈ క్రింది వెబ్సైట్స్ ద్వారా ఒక్క సెకండ్ లోనే విద్యార్థులు వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
పైన ఉన్న నాలుగు వెబ్సైట్ ద్వారా వెంటనే విద్యార్థుల వరకు ఫలితాలను చూసుకోగలరు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి:
సీబీఎస్ఈ పదోతరగతి మరియు 12వ తరగతి ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
- ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cbse.gov.in లేదా results.cbse.nic.in ఓపెన్ చేయండి.
- CBSE Class 10th / CBSE Class 12th Results 2025″ ఆప్షన్పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్, స్కూల్ కోడ్, అడ్మిట్ కార్డ్ ఐడి ఎంటర్ చేయండి.
- సబ్మిట్ ఆప్షన్ పెట్టి చేసిన వెంటనే ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి
- చూపించిన రిజల్ట్స్ ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి
Digilocker లో ఫలితాలు ఎలా చూడాలి?:
- Digilocker లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు డిజిటల్ మార్క్ షీట్స్ అందుబాటులో ఉంటాయి
- అయితే విద్యార్థులు ముందుగానే digilocker.gov.in వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
గత సంవత్సరం ఫలితాల ట్రెండ్ ఎలా ఉంది :
- 2024 లో 12వ తరగతి ఫలితాలలో 87.33% పాస్ పర్సంటేజ్ నమోదయింది.
- పదవ తరగతి ఫలితాల్లో 93.12% విద్యార్థులు పాస్ కావడం జరిగింది
CBSE విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
- సీబీఎస్ఈ టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలు చూసుకునే సమయంలో వెబ్సైట్స్ త్వరగా ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు. సర్వర్లు డౌన్ అవ్వడం వల్ల ఓపెన్ కావడానికి ఎప్పుడు సమయం పట్టే అవకాశం ఉంటుంది
- కావున విద్యార్థులు ఫలితాలు చూసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే స్కూల్ లేదా సీబీఎస్ఈ హెల్ప్ లైన్ ని వెంటనే సంప్రదించాలి.
FAQ’s:
1. సీబీఎస్ఈ టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
మే 13 లేదా 14వ తేదీల్లో సీబీఎస్ఈ టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నారు
2. సీబీఎస్ఈ టెన్త్ మరియు 12వ తరగతి ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి?
అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
