TTD SVIMS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ :10th అర్హత | పరీక్ష లేదు – Apply చెయ్యండి

TTD SVIMS Notification 2025:

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి 12 పోస్టులతో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా డిస్క్రిప్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తారు. అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్, మార్చురీ మెకానిక్ ,ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం కోసం అర్హతలు కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు :

పోస్టల్ వారీగా కాలేల వివరాలను ఈ క్రింది పట్టికలో చూడండి.

Join Whats App Group

పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
అనస్తీసియా టెక్నీషియన్01
లేబర్ అటెండెంట్07
డేటా ఎంట్రీ ఆపరేటర్01
ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్01
మార్చురీ మెకానిక్01
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్01
మొత్తం పోస్టులు12

పోస్టుల వారిగా అర్హతలు :

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు పోస్టుల వారిగా ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. అనస్థీషియా టెక్నీషియన్ : డిప్లమోలో అనస్థీషియా టెక్నాలజీ చేసి ఉండాలి
  2. ల్యాబ్ అటెండెంట్ : టెన్త్ అర్హత కలిగి ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేసి ఉండాలి
  3. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ : పదో తరగతి అర్హత కలిగి మూడు సంవత్సరాల నర్సింగ్ కూడా వెళ్లి అనుభవం కలిగి ఉండాలి
  4. డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హత పాటు కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని పీజీడిసిఏ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  5. మార్చురీ మెకానిక్: మార్చురీ మెకానిక్ గా డిప్లమా కోర్సు చేసి ఉండాలి
  6. ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్: ఐటిఐ ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్ కోర్స్ చేసి ఉండాలి

ఎంత వయస్సు ఉండాలి?:

తిరుపతిలోని స్విమ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

ఫుడ్ డిపార్ట్మెంట్లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు ఎంత?:

సిమ్స్ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • ఓసి అభ్యర్థులు : ₹300/- ఫీజు చెల్లించాలి
  • SC, ST, OBC అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు

ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసీ తిరుపతి పేరు మీద డిడి తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు డిడి రిసిప్ట్ కూడా పంపించాలి.

ఎంత శాలరీ ఉంటుంది:

తిరుపతి స్విమ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులు అనుసరించి కనీసం ₹15000/- నుండి ₹32,670 శాలరీ ఉంటుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.

TS EAMCET ఆన్సర్ కీ విడుదల

ఎంపిక చేసే విధానం:

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేస్తారు

  1. మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు
  2. అర్హతలు మరియు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయిస్తారు
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు

ఎలా అప్లై చేయాలి?:

స్విమ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
  2. అప్లికేషన్ పూర్తి చేసి, మే 10వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించాలి
  3. అప్లికేషన్ పంపించే ముందు అప్లికేషన్ తో పాటు మిగిలినటువంటి డాక్యుమెంట్స్ కూడా పంపించాలి
  4. డిమాండ్ డ్రాఫ్ట్ రిసిప్ట్ కూడా పంపించాలి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :

స్కిమ్స్ ఔట్సోర్సింగ్ జాబ్స్ ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి

అప్లికేషన్ ఆఖరి తేదీమే 10th, 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీజూన్ 17th, 2025
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీజూన్ 23rd, 2025

పైన తెలిపిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు కలిగినటువంటి వారు ఈ క్రింది నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

Notification & Application Form

Official Website

FAQ’s:

1. స్విమ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అర్హులా?

అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు

2. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ?

మే 10 2025 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి

3. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుందా?

ఎటువంటి రాధ పరీక్షలు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు