తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల : వెంటనే జాయిన్ అవ్వండి

TS Inter Admissions Schedule 2025:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన వెంటనే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇంటర్ అడ్మిషన్స్ కి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, అన్ ఎయిడెడ్ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వారి యొక్క అడ్మిషన్స్ ని ప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ:

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ని మే ఒకటో తేదీ నుంచి మొదటి దశ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జూన్ రెండవ తేదీ నుండి జూనియర్ కళాశాలల క్లాసులు ప్రారంభించాలని తెలిపారు. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30వ తేదీ వరకు ముగించాలి.

  • రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మే 1st, 2025
  • రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ : మే 31st, 2025
  • క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీలు : జూన్ 2nd, 2025
  • ఫస్ట్ పేజ్ అడ్మిషన్స్ పూర్తయ్య తేదీ : జూన్ 30, 2025

Join Whats App Group

కళాశాలల వివరాలు ఎలా తెలుసుకోవాలి?:

పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కళాశాలల్లోనే జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ వారు తెలిపారు. బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల వివరాలను అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చు.

TS 10th రిజల్ట్స్ ఎలా చూడాలి?:

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాలను ఇంకా చేసుకొని విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్లో వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ జిల్లా గ్రంధాలయ సంస్థల్లో 976 ఉద్యోగాలు

TS 10th సప్లమెంటరీ పరీక్షల తేదీలు:

తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు జూన్ 3 నుండి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజును మే 16వ తేదీలోగా సంబంధిత హై స్కూల్లో విద్యార్థులు చెల్లించాలి.

పైన తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభమైనందున విద్యార్థులు వెంటనే గుర్తింపు పొందినటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలో జాయిన్ అవ్వండి.

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి దేశ అడ్మిషన్లు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి?

మే ఫస్ట్ నుంచి జూన్ 30వ తేదీ వరకు మొదటి దశ అడ్మిషన్లు జరుగుతాయి

2. బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల వివరాలు ఎలా తెలుసుకోవాలి?

గుర్తింపు పొందిన ఇంటర్ కళాశాలల వివరాలను tgbie.cgg.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు.