TS SSC 10th Results 2025 Released, How To Check @bse.telangana.gov.in

TS SSC 10th Results 2025 Released:

తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షలకు భాగం సంచాలకుడు ఏ.కృష్ణారావు తెలిపారు. మొత్తం 5.09 లక్షల మంది విద్యార్థులలో 4.9 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈసారి గ్రేడింగ్ విధానంలో కాకుండా మార్కులు మరియు గ్రేడ్లతో పరీక్ష ఫలితాలు ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి.

టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల సమయం ఏమిటి?:

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు (2PM) విడుదల చేస్తున్నారు. పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.

Join Whats App Group

TS 10th Results 2025

రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:

ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్ ద్వారా చాలా సులభంగా చేసుకోగలరు.

  1. www.results.bsetelangana.org
  2. www.bse.telangana.gov.in
  3. www.freejobsintelugu.com
  4. results.eenadu.net
  5. results.eenadupratibha.net
  6. www.sakshieducation.com

పైన తెలిపిన వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి.

  • ముందుగా అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజీలో “TS 10th Results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  • డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి
  • వెంటనే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి
  • రిజల్ట్స్ ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:

తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలను ఫలితాలు విడుదల చేసిన ఒక నెలలోపు నిర్వహించడం జరుగుతుంది. మే నెల లేదా జూన్ నెలలో పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు.

TS 10th రిజల్ట్స్ చూసుకునే Websites ఇవే

SMS ద్వారా ఫలితాలు ఎలా చూడాలి?:

విద్యార్థులు వారి యొక్క మొబైల్ లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

  1. ముందుగా మొబైల్లో మెసేజ్ యాప్ ఓపెన్ చేయండి
  2. 56263 నెంబర్ కు “TS10ROLLNUMBER” మెసేజ్ పంపించండి.
  3. వెంటనే విద్యార్థులకు రిప్లై రూపంలో ఎంత పరీక్ష ఫలితాలు వివరాలు మెసేజ్ రావడం జరుగుతుంది.
  4. వచ్చినటువంటి ఫలితాలు వివరాలను నోట్ చేసుకోవాలి

FAQ’s:

1. తెలంగాణ టెన్త్ పరీక్షలు విడుదలయ్యే తేదీ మరియు సమయం ఏమిటి?

ఏప్రిల్ 30,2025 మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేశారు.

2.మొత్తం ఎన్ని లక్షల మంది పరీక్షలు రాశారు?.

4.9 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాయడం జరిగింది.

3. సప్లమెంటరీ రాత పరీక్షలు ఎప్పుడు?

టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు నెల రోజుల్లో గా సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.