AP Library Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 976 డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులను ప్రస్తుతం తాత్కాలిక విధానంలో అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపుతూ నోటీసు విడుదల చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 15వ తేదీన ఏ.కృష్ణమోహన్, ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఖాళీగా ఉన్న 976 పోస్టులని అర్జెంట్ గా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ ఉద్యోగాల అర్హతలు, పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయి:
ఈ క్రింది పట్టికలో ఉన్న పోస్టుల ఖాళీలు వివరాలు చూడగలరు.
| క్రమ సంఖ్య | పోస్టుల పేరు | ఖాళీల సంఖ్య |
| 01 | లైబ్రేరియన్ గ్రేడ్ 2 | 92 |
| 02 | లైబ్రేరియన్ గ్రేడ్ 3 | 224 |
| 03 | రికార్డు అసిస్టెంట్ | 111 |
| 04 | ఆఫీస్ సబార్డినేట్ | 421 |
| 05 | వాచ్మెన్ | 128 |
| మొత్తం పోస్టులు | 976 |
ఈ ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయి?:
- ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయాల్లో ఖాళీలు ఏర్పడడానికి గల ముఖ్యమైన కారణాలు : ఉద్యోగుల పదవీ విరమణలు, రాజీనామాలు, సర్వీసు బదిలీలు లేదా ట్రాన్స్ఫర్ ల వల్ల చాలా సంవత్సరాలుగా లైబ్రరీలలో ఖాళీలు ఏర్పడ్డాయి.

ఈ పోస్టులకు ఎవరు అర్హులు?:
- లైబ్రేరియన్ గ్రేడ్ 2 & గ్రేడ్ 3 పోస్టులకు: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి లైబ్రరీ సైన్స్ లో పీజీ చేసినటువంటి వారికి అవకాశం ఉంటుంది.
- రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు: ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు అర్హులు.
- ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులకు : టెన్త్ అర్హత కలిగినటువంటి వారు అర్హులు.
- పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు వయస్సు వివరాలు తెలుసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది?:
976 గ్రంథాలయ ఉద్యోగాల్ని డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నాకూడా, ప్రస్తుతం ఆ రిక్రూట్మెంట్ జరగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి
- ప్రస్తుత ప్రతిపాదన ఏమిటంటే: ఔట్సోర్సింగ్ విధానంలో తాత్కాలికంగా నియామకం చేయాలని కోరడం జరిగింది
- తదనంతరం: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూర్తిస్థాయి నియామకం చేయడం జరుగుతుంది.
లైబ్రరీల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?:
- రికార్డ్ అసిస్టెంట్ వాచ్మెన్ లాంటి పోస్టులైతే లైబ్రరీలో ఒకే ఒక్క సిబ్బందితో సర్దుకోవాల్సి వస్తోంది.
- కొన్ని లైబ్రరీలోని సిబ్బంది అయితే రెండు shifts లో పనిచేస్తున్నారు.
- కొన్ని లైబ్రరీలు అయితే అసలు సిబ్బంది లేక మూతపడ్డాయి కూడా
- లైబ్రరీ నుండి సెస్సు వసూలు చేస్తున్న కూడా లైబ్రరీల పరిస్థితులను బాగు చేయట్లేదు అని విమర్శలు వస్తున్నాయి.
- గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విద్యావంతులు విద్యా, ఉద్యోగ మరియు ఇతర సమాచారం సరిగా లభించకపోవడం వల్ల నష్టపోతున్నారు.
తాత్కాలిక నియామక ప్రతిపాదనలో పేర్కొన్న ఉద్యోగాలు:
లైబ్రేరియన్ గ్రేడ్ 2, లైబ్రేరియన్ గ్రేడ్ 3, రికార్డ్ అసిస్టెంట్, వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
Also Read: యూనియన్ బ్యాంకుల్లో 500 ఉద్యోగాలు
ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఉద్యోగాల ప్రకటన విడుదలయితే అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. మీకు పైన తెలిపినటువంటి పోస్టుల్లో అర్హతలు కలిగి ఉంటే ఇప్పటి నుంచే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి.
AP Library Vacancy: Official Notice
FAQ’s:
1. ఏపీ జిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి?.
మొత్తం 976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి
2. ఈ గ్రంథాలయ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి?
10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, లైబ్రరీ సైన్స్ అర్హతలు ఉండాలి.
