TS SSC 10th Results 2025:
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 1PM కు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఫలితాలను ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణ పదవ తరగతి పరీక్షలను మొత్తం ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు రాయడం జరిగింది. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసి మార్కులు మరియు గ్రేడుల్లో మార్పులు చేసి మార్క్స్ మెమోల్ లో మార్కులు మరియు గ్రేడులు కలిపి ఇవ్వడం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా తెలిపారు.
ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం :
తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయబోతున్నారు. పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వెంటనే వారి యొక్క మొబైల్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చూడాలి:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది 5 వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
- www.bse.telangana.gov.in
- www.freejobsintelugu.com
- www.sakshieducation.com
- www.eenadu.net
- www.manabadi.co.in
పైన ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను చూసుకోగలరు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ” TS 10th Results 2025″ ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
- విద్యార్థులు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫలితాల్ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోవాలి
SMS ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చు:
ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు చూసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా మీ మొబైల్ లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేసి 56263 నంబర్ కు ” TS10ROLLNUMBER” అని మెసేజ్ చేయాలి.
- వెంటనే విద్యార్థులకు సంబంధించినటువంటి సబ్జెక్టుల వారి మార్కులు పాస్ లేదా ఫెయిల్ కి సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో రిప్లై రావడం జరుగుతుంది.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఫలితాలు విడుదలైన నెల రోజుల్లోపు నిర్వహించడం జరుగుతుంది. అంటే జూన్ నెలలో పరీక్షలు ఉంటాయి.
BSNL 5G SIM హోం డెలివరీ సర్వీస్
FAQ’s:
1. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?:
ఏప్రిల్ 30,2025 మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
2. తెలంగాణ టెన్త్ పరీక్షలు ఎంతమంది రాశారు?:
తెలంగాణ పదవ తరగతి పరీక్షలను ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు రాయడం జరిగింది.
3. ఫలితాలు చూసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చు.
