TS SSC 10th Results 2025 Official Date:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలను (TS SSC 10th Results 2025) ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇప్పటికే ఏప్రిల్ 23వ తేదీన తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు బట్టి విక్రమార్క ఏప్రిల్ 30న సమయం కేటాయించడం జరిగింది. ఫలితాలకు సంబందించిన పూర్తి సమాచారం చూడండి.
10th మార్క్స్ మెమోల్లో మార్పులు:
తెలంగాణా 10th మార్క్స్ మెమోల్లో భారీగానే మార్పులు చేస్తున్నారు. దీనికి సంబందించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కూడా గ్రేడింగ్ విధానంలోనే మెమోలు ఇచ్చేవారు. ఇకపై పదో తరగతి మార్క్స్ మెమోల్లో గ్రేడ్స్ తో పాటు మార్కులు కూడా కలిపి ఇవ్వనున్నారు. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ మార్కులు, GPA మెమోలో ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపారు.
టెన్త్ ఫలితాలు విడుదల తేదీ:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ అధికారికంగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయమన్నారు. ఫలితాలు విడుదల మరియు సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ని క్రింది డేటా ద్వారా తెలుసుకోగలరు.

- ఫలితాలు విడుదల తేదీ: 30th ఏప్రిల్ 2025
- అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?: ఫలితాలు విడుదలైన 30 రోజుల్లోగా సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు చూసుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- హోం పేజీలో “TS SSC 10th Results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్ధి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- స్క్రీన్ పైన విద్యార్థి యొక్క ఫలితాలు కనిపిస్తాయి.
- ఫలితాలను డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
SMS ద్వారా ఫలితాలు ఎలా చూడాలి?:
పదో తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు చూసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా విద్యార్థులు వారి యొక్క మొబైల్ లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయాలి.
- తర్వాత 56263 నెంబర్ కు TS10ROLL NUMBER తో ఎస్ఎంఎస్ చేయాలి.
- వెంటనే విద్యార్థి యొక్క ఫలితాలు మెసేజ్ రూపంలో రిప్లై రావడం జరుగుతుంది.
5 Websites లో ఫలితాలు:
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఈ క్రింది 5 వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకోగలరు.
పైన ఇచ్చిన వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి విద్యార్థులు వారి యొక్క ఫలితాన్ని చూసుకోవచ్చు.
ఫలితాలు చూసుకున్న తర్వాత మీ యొక్క రిజల్ట్స్ సమాచారాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.
FAQ’s:
1. తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యే అధికారిక తేదీ ఏమిటి?
సమాధానం: తెలంగాణ ప్రభుత్వం ప్రకారం,ఏప్రిల్ 30, 2025 న ఫలితాలు విడుదల చేస్తున్నారు.
2. తెలంగాణ టెన్త్ పరీక్షలు ఎంత మంది విద్యార్థులు రాశారు?
సమాధానం: 5.09 లక్షల మంది రాశారు.
3. TS 10th Results 2025 ని చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్స్ ఏమిటి?:
సమాధానం: bse.telangana.gov.in, www.freejobsintelugu.com, results.bse.telangana.gov.in
