TS SSC 10th Results 2025 Released:
తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదలపై అధికారిక తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 30న పదవ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గతంలో 10వ తరగతి మార్క్స్ మెమోల్లో గ్రేడ్లు, CGPA రూపంలో ఉండేవి. కానీ ఈ సంవత్సరం ఫలితాల నుండి పదవ తరగతి మార్క్స్ మేమోల్లో సీబీఎస్ఈ మాదిరిగా సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విద్యాశాఖ యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదో తరగతి ఫలితాలు విడుదలకు అడ్డంకులు పలికాయి. ఇంకా ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
మొత్తం 5,09,403 మంది అభ్యర్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిగింది. ఇప్పుడు ఫలితాలను విడుదల చేస్తున్నారు.
ఫలితాలు విడుదల ఎప్పుడు:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సబ్జెక్టుల వారిగా గ్రేడ్లు, మార్కులతో మార్క్స్ మెమోల్లో పొందుపరిచి విద్యార్థులకు ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది.

రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా పదో తరగతి ఫలితాలు అధికార వెబ్సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ‘TS SSC 10th Results 2025‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- స్క్రీన్ పైన టెన్త్ ఫలితాలు కనిపిస్తాయి.
- ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ అవుట్ తీసుకోవడం చేయాలి
టెన్త్ మెమోల్లో ఇకపై గ్రేడ్లు, మార్కులు:
పదో తరగతి పరీక్ష మార్క్స్ మెమోల్లో సీబీఎస్ఈ మాదిరిగా మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదో తరగతి మార్క్స్ మెమోల్లో ఇకపై సబ్జెక్టుల వారిగా గ్రేడ్లు మరియు మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కి సంబంధించిన మార్కులు టోటల్ గ్రేట్ పాయింట్లు, టోటల్ మార్కులు ఉంటాయి. అభ్యర్థులు పాస్ లేదా ఫెయిల్ అంశాలు కూడా పొందుపరచడం జరుగుతుంది.
రిజల్ట్స్ 5 అధికారిక వెబ్సైట్స్ ఇవే:
విద్యార్థులు ఫలితాలు చూసుకునేందుకు ఈ క్రింది వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
- www.bse.telangana.gov.in/
- results.bse.telangana.gov.in/
- www.sakshieducation.com/
- www.manabadi.co.in
- www.eenadu.net
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. సబ్జెక్టులో ఫెయిల్ అయినటువంటి వారు పరీక్ష ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను కూడా జూన్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
FAQ’s:
1.తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల తేదీ?:
సమాధానం: మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలను విడుదల చేయబోతున్నారు.
2. టెన్త్ మార్క్స్ మెమోల్లో గ్రేడ్లు మార్కులు ఉంటాయా?
సమాధానం: అవును. ఇకపై తెలంగాణ పదవ తరగతి ఫలితాలు మార్క్స్ నమోదులో సబ్జెక్టుల వారిగా గ్రేడ్లు మరియు మార్కులు ఉంటాయి.
3. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చు?:
సమాధానం: సప్లిమెంటరీ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.