TS SSC 10th Results 2025 Date & Time:
తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మరో రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు ఈరోజు ఒక సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల చేసినందున తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలపై కూడా ఒత్తిడి పెరిగింది. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణ పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిగింది. ఇప్పుడు ఫలితాన్ని విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ ఫలితాతెలంగాణ పదవ తరగతి ఫలితాలను రేపు అనగా లు రేపు విడుదల కాని పక్షంలో మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా సమాచారం:
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు ఇప్పటికే విడుదలైనందున తెలంగాణ పదవ తరగతి ఫలితాలపై కూడా చర్చ మొదలైంది. అయితే తెలంగాణ పదవ తరగతి ఫలితాలను మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు సాక్షి మరియు శిక్ష అనేటువంటి వెబ్సైట్లో సమాచారం వచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా జారీ కాలేదు.
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల తేదీ:
ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని కొన్ని వెబ్సైట్లో మరియు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఏప్రిల్ 28న ఫలితాలు విడుదల కాకపోతే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ 5 వెబ్సైట్స్ లో రిజల్ట్స్ చూసుకోండి:
- https://bse.telangana.gov.in/
- www.sakshieducation.com
- www.eenadu.net
- www.manabadi.co.in
- results.bse.telangana.gov.in
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :
ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ‘TS SSC 10th Results 2025′ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
- స్క్రీన్ పైన ఫలితాలని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకు, తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. సబ్జెక్టులో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు ఫీజు చెల్లించి, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి.
ఫలితాలు చూసుకున్న విద్యార్థులు మీ యొక్క ఫలితాల వివరాలను క్రింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
FAQ’s:
1. తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?:
సమాధానం: రెండు మూడు రోజుల్లో లేదా మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
2. టెన్త్ ఫలితాలను చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
సమాధానం: టెన్త్ విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్సైట్ నందు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
3. ఫలితాలు చూసుకోవడానికి కావలసిన వివరాలు ఏమిటి?
సమాధానం: పదో తరగతి విద్యార్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.