TS SSC 10th Results 2025:
తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ 10వ తరగతి ఫలితాలను మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు తెలిపారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు రాశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 17వ తేదీతో ముగిసింది. ఇప్పటికే మార్కుల డిజిటలైజేషన్ చేసిన అధికారులు ఫలితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు.
ఫలితాలు విడుదల తేదీ (Expected Date):
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి ఫలితాలను రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పదవ తరగతి ఫలితాలు కూడా విడుదల చేసి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభించాలని చూస్తోంది.
టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
ఫలితాలు ఎలా చూసుకోవాలి:
పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది 5 వెబ్సైట్ ద్వారా చూసుకోగలరు.
- bse.telangana.gov.in
- bseresults.telangana.gov.in
- https://www.manabadi.co.in/
- www.sakshieducation.com
- www.eenadu.net
పైన తెలిపిన ఐదు వెబ్సైట్ ద్వారా ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో ‘TS SSC 10th Results 2025‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఫలితాలు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తాయి.
- ఫలితాలను డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
SMS ద్వారా కూడా ఫలితాలు:
పదవ తరగతి ఫలితాలు తెలుసుకోవాలని అనుకునే విద్యార్థులు ఎస్ఎంఎస్ ద్వారా కూడా వారి యొక్క ఫలితాలను చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా రిజల్ట్స్ చూసుకోండి.
- ముందుగా మీ మొబైల్ లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయాలి
- ‘TS10ROLLNUMBER‘ ని ఎంటర్ చేయాలి.
- 56263 నంబర్ కు మెసేజ్ చేయాలి.
- వెంటనే విద్యార్థి యొక్క ఫలితాలు మెసేజ్ రిప్లై రావడం జరుగుతుంది.
పైన తెలిపిన విధంగా కూడా విద్యార్థులు వారి యొక్క ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలు ఆలస్యానికి కారణం:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో 10వ తరగతి ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల విధానంలోనే ఫలితాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారికి ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు రాకపోవడం వల్ల ఫలితాలు విడుదలలో కొంత జాప్యం ఏర్పడడం జరిగింది. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు.
ఫలితాలు చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కుల వివరణ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెన్త్ ఇంటర్మీడియట్ ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ని విజిట్ చేయండి.
FAQ’s వివరాలు:
TS 10th ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
సమాధానం: తెలంగాణ పదవ తరగతి ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
2. TS 10th సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?
సమాధానం: తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
3. తెలంగాణ టెన్త్ పరీక్షలు ఎంతమంది రాశారు?:
సమాధానం: తెలంగాణ పదవ తరగతి పరీక్షలను మొత్తం 5,09,403 మంది అభ్యర్థులు రాశారు.
