IPL 2025 : SRH vs CSK Match:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 లో ప్లే ఆఫ్ టీమ్స్ లో స్థానం కోసం ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలకమైనటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరిలో ఉన్నటువంటి ఈ రెండు టీమ్స్ ఎలాగైనా ఈ రోజు మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ లో కొంత మెరుగైన స్థానానికి ఎగబాకాలని చూస్తున్నాయి. అయితే ఈ రెండు చెట్ల మధ్య ఉన్నటువంటి బలాబలాలు ఏమిటి, ఈరోజు మ్యాచ్ ఎక్కడ, ఏ సమయంలో జరగబోతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం
SRH vs CSK మ్యాచ్ వివరాలు:
- మ్యాచ్ ఎవరెవరికి : సన్రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ , IPL 2025
- మ్యాచ్ జరిగే తేదీ & సమయం: 24th ఏప్రిల్, 2025 – రాత్రి 7:30PM IST.
- మ్యాచ్ జరిగే స్టేడియం : MA చిదంబరం స్టేడియం, చెన్నై.
- మ్యాచ్ ప్రసారం చేసే ప్లాట్ ఫామ్స్ : స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ .
ఇరుజట్ల ప్రస్తుత పాయింట్స్ టేబుల్ పరిస్థితి:
- SRH టీం: ఇప్పటికే 8 మ్యాచులు ఆడి, రెండు మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది.
- CSK టీం: ఈ జట్టు కూడా ఇప్పటికే 8 మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్లోనే గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో పదో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ CSK, SRH కు చాలా కీలకమైంది. ప్లే ఆఫ్ రేస్ లో ఈ జట్లు కొనసాగాలంటే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ తప్పనిసరిగా గెలిచి తీరాలి.
SRH vs CSK జట్ల మధ్య పోటాపోటీ వివరాలు:
- ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొత్తం మ్యాచులు: 21
- CSK టీం గెలిచిన మ్యాచ్ లు: 15
- SRH టీం గెలిచిన మ్యాచ్ లు: 6
- చెన్నై వేదికగా SRH టీం విజయాలు: 0
SRH ఇప్పటివరకు చెన్నై వేదికగా CSK పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది CSK నీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది.
ఇరుజట్లలో ప్లేయర్స్ వీళ్లే:
CSK (Chennai Super Kings:
- CSK టీం కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ మ్యాచ్. ఇది జట్టుకు చాలా మోటివేషన్ ఇస్తుంది.
- ఓపెనింగ్ బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ కీలకం.
- డెప్త్ బౌలింగ్లో రవీంద్ర జడేజా, మతిషా పతి రానా కీలకం.
SRH ( Sunrisers Hyderabad):
- SRH టీంకు పవర్ఫుల్ ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అక్షయ్ శర్మ ఉన్నారు.
- మహమ్మద్ షమీ పవర్ ప్లే లో కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్నాడు.
పిచ్ & వాతావరణ పరిస్థితులు:
- చపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి టీంకు 160+ స్కోరు సేఫ్ స్కోర్ గా చెప్పుకోవచ్చు.
- చాలా క్లియర్ వాతావరణ ఉంది. వర్షానికి ఎటువంటి అడ్డంకి లేదు.
గెలుపు అవకాశాలపై విశ్లేషణ :
- చెన్నై టీంకు అనుభవం కలిగిన కెప్టెన్ ధోని ఉండడం పెద్ద అడ్వాంటేజ్. అలాగే ఈరోజు మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్నందున మరొక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు.
- SRH టీం ఈ సీజన్లో సరిగా ఆడకపోయినా కొన్ని మ్యాచ్ల్లో చాలా మ్యాజిక్ చేసింది. ఈరోజు కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మంచి బౌలింగ్ మరియు బ్యాటింగ్ లైన్ అప్ తో ఇరు జట్లు కూడా చాలా స్ట్రాంగానే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రోజు మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇవ్వబోతోంది.
