NEET UG 2025 ఇంటిమేషన్ స్లిప్ విడుదల – ఎగ్జామ్ సిటీ తెలుసుకోవడానికి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

NEET UG 2025 intimation slip released :

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 రాత పరీక్షకు సంబంధించి విద్యార్థులు ముందుగానే సిటీ ఎగ్జామ్ సెంటర్ తెలుసుకునే విధంగా ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయడం జరిగింది. నీట్ యూజీ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క సిటీ సెంటర్ తెలుసుకోవడం ద్వారా ముందుగానే ప్రయాణం ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఇంటిమేషన్ స్లిప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది.

ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏమిటి?:

  • ఇది రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ కాదు, ఇది పరీక్ష రాబోయే ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
  • ఈ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా విద్యార్థులు వారి పరీక్ష కేంద్రం యొక్క సిటీ సెంటర్ ని ముందుగానే తెలుసుకోవచ్చు.
  • పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి చేసుకోవలసిన ముందస్తు ఏర్పాట్లు అన్నీ కూడా ఈ ఇంటిమేషన్స్ ఆధారంగా చేసుకోవచ్చు.

ఇంటిమేషన్ స్లిప్ విడుదలయ్యేది తేదీ:

  • ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీ : 24th ఏప్రిల్, 2025
  • డౌన్లోడ్ చేసుకునే అధికారిక వెబ్సైట్ : https://neet.nta.nic.in

ఇంటిమేషన్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :

  • ముందుగా https://neet.nta.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • వెబ్సైట్ హోమ్ పేజీలో ” advance intimation for exam City ” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత విద్యార్థుల యొక్క అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • తద్వారా స్క్రీన్ పైన కనిపించే ఇంటిమేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.

NEET UG 2025 admit card ఎప్పుడు విడుదల చేస్తారు:

NTA NEET UG 2025 పరీక్ష రాయబోయేటువంటి విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ స్లిప్ కి సంబంధించిన సమాచారంతోపాటు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే సమాచారం కోసం కూడా ఎదురు చూస్తున్నారు.

  1. అడ్మిట్ కార్డు విడుదలయ్యే తేదీ : మే మొదటివారం 2025
  2. NEET UG పరీక్ష తేదీ: మే 5th, 2025

FAQ’s:

1. ఇంటిమేషన్ స్లిప్ లేనివారు పరీక్షలు రాయలేరా?

ఇంటిమేషన్ స్లిప్ లేకపోయినా కూడా పరీక్ష రాయవచ్చు అది తప్పనిసరి కాదు, కానీ ఇంటిమేషన్ స్లిప్ ఉండడం వల్ల విద్యార్థి యొక్క పరీక్ష కేంద్రం సిటీ సెంటర్ తెలుసుకోవచ్చు.

2. అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదల చేస్తారు?:

అడ్మిట్ కార్డ్ మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

3. ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డులో తప్పులు ఉంటే ఏం చేయాలి?:

విద్యార్థులు ఈ డాక్యుమెంట్స్ లో తప్పులు గమనించినట్లయితే, NEET అధికారిక వెబ్సైట్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలి.

విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఇంటిమేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారి యొక్క పరీక్ష కేంద్రం యొక్క సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని పరీక్ష జరిగే సమయంలో గా కేంద్రానికి చేరుకోవచ్చు. మరింత సమాచారం కోసం రెగ్యులర్గా అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in ను సందర్శించండి.